AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WorldCup 2026 : మొహ్సిన్ నఖ్వీ భారీ స్కెచ్..టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు పాక్ సరికొత్త డ్రామా

T20 WorldCup 2026 : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తాము భారత్ రాబోమని అధికారికంగా ప్రకటించడానికి భద్రతా కారణాలను సాకుగా చూపిస్తోంది. అయితే దీని వెనుక మాత్రం అక్కడి మొహమ్మద్ యూనస్ ప్రభుత్వ ఒత్తిడి బలంగా ఉందని సమాచారం. భారత్‌లో తమ జట్టుకు రక్షణ ఉండదని వారు వాదిస్తున్నారు.

T20 WorldCup 2026 : మొహ్సిన్ నఖ్వీ భారీ స్కెచ్..టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు పాక్ సరికొత్త డ్రామా
T20 World Cup
Rakesh
|

Updated on: Jan 19, 2026 | 2:28 PM

Share

T20 WorldCup 2026 : 2026లో భారత్ వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌కు ముందే పొలిటికల్ హీట్ మొదలైంది. క్రికెట్ కంటే ఎక్కువగా ఇప్పుడు దేశాల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వచ్చి ఆడేందుకు నిరాకరించడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారం వెనుక బంగ్లాదేశ్ కంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చక్రం తిప్పుతున్నట్లు అంతర్జాతీయ క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. భారత్‌లో టోర్నీని సజావుగా సాగనివ్వకూడదనే కుట్ర ఇందులో దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బంగ్లాదేశ్ భద్రతా సాకులు.. అసలు కథ వేరే?

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తాము భారత్ రాబోమని అధికారికంగా ప్రకటించడానికి భద్రతా కారణాలను సాకుగా చూపిస్తోంది. అయితే దీని వెనుక మాత్రం అక్కడి మొహమ్మద్ యూనస్ ప్రభుత్వ ఒత్తిడి బలంగా ఉందని సమాచారం. భారత్‌లో తమ జట్టుకు రక్షణ ఉండదని వారు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్థాన్ మద్దతు కోరింది. ఆశ్చర్యకరంగా పాకిస్థాన్ వెనుకాముందు ఆలోచించకుండా బంగ్లాదేశ్‌కు జై కొట్టింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని పాక్ డిమాండ్ చేయడం విశేషం.

పాకిస్థాన్ మైండ్ గేమ్.. ఐసీసీకి హెచ్చరిక?

పాకిస్థాన్ కేవలం సపోర్టు పలకడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి ఐసీసీని బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తోంది. ఒకవేళ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పిస్తే తాము కూడా వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటామని సంకేతాలు ఇచ్చింది. ఆసియా క్రికెట్‌లో బీసీసీఐ ఆధిపత్యానికి గండి కొట్టేందుకే మొహ్సిన్ నఖ్వీ ఈ తరహా ఎత్తుగడలు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. జియో సూపర్ వంటి పాకిస్థాన్ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. పాక్ ప్రభుత్వం బంగ్లాదేశ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

ఐసీసీ డెడ్ లైన్.. తేల్చి చెప్పిన కౌన్సిల్

ఈ గందరగోళం మధ్య అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన వైఖరిని స్పష్టం చేసింది. టీ20 వరల్డ్ కప్ వేదికలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఐసీసీ ప్రతినిధులు బంగ్లాదేశ్ వెళ్లి చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఐసీసీ జనవరి 21 వరకు బంగ్లాదేశ్‌కు చివరి అవకాశం ఇచ్చింది. ఆ తేదీ లోపు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే బంగ్లాదేశ్ స్థానంలో వేరే జట్టును టోర్నీలోకి తీసుకుంటామని హెచ్చరించింది. అటు భారత్ కూడా భద్రత విషయంలో ఎలాంటి లోటు ఉండదని భరోసా ఇస్తున్నా, బంగ్లాదేశ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

టోర్నీ షెడ్యూల్ పట్టాలెక్కుతుందా?

జనవరి 21 తర్వాత ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బంగ్లాదేశ్, పాకిస్థాన్ రెండూ టోర్నీకి దూరమైతే, ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్ నిర్వహించే ప్రతిష్టాత్మక టోర్నీని అభాసుపాలు చేయాలనే పాక్ వ్యూహం ఎంతవరకు పారుతుందో చూడాలి. ఏదేమైనా క్రికెట్ అభిమానులు మాత్రం ఆటను ఆటలాగే చూడాలని, రాజకీయాలను మైదానంలోకి తీసుకురావొద్దని కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..