Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి తో కలిసి సెల్ఫీలు దిగాలనుకుంటున్నారా? మీ దగ్గరికే రానున్నకల్కి టీమ్

ఈ ఏడాది రిలీజ్ కానున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' ఒకటి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి తో కలిసి సెల్ఫీలు దిగాలనుకుంటున్నారా? మీ దగ్గరికే రానున్నకల్కి టీమ్
Prabhas Bujji
Follow us
Basha Shek

|

Updated on: May 27, 2024 | 4:00 PM

ఈ ఏడాది రిలీజ్ కానున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఒకటి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీపికతో పాటు బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ అతిథి పాత్రలో మెరవనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది చిత్ర బృందం. కాగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం ప్రత్యేకంగా ఈ కారును తయారు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దీన్ని ఆవిష్కరించారు. చాలా మంది ఆటోమొబైల్ వినియోగదారులు దీని గురించి వీడియోలు చేశారు. సుమారు ఐదు కోట్ల రూపాయలతో దీనిని తయారు చేసినట్లు తెలస్తోంది. ఆటో మొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా బుజ్జి పై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే అక్కినేని అందగాడు నాగ చైతన్య కూడా బుజ్జి కారును నడిపాడు. అంతకు ముందు ఇదే వాహానాన్ని ప్రభాస్‌ నడుపుకుంటూ కనిపించి సందడి చేశాడు

కాగా ఇప్పుడు ఈ కారును వివిధ నగరాలకు తీసుకెళ్లాలని కల్కి టీమ్ నిర్ణయించింది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో దీన్ని ప్రదర్శించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అభిమానులను సెల్ఫీలు తీసుకునేందుకు టీమ్ అనుమతిస్తోంది. అదే సమయంలో నాగ చైతన్య లాగా ప్రముఖ సెలబ్రిటీలకు డ్రైవింగ్‌కు కూడా ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ‘కల్కి 2898 AD’ సినిమాని నాగ్ అశ్విన్ రూపొందించారు. కారు ఆలోచన కూడా ఆయనదే. ఈ బుజ్జి కారును మహీంద్రా కంపెనీ తయారు చేసింది. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉంది.

ఇవి కూడా చదవండి

బుజ్జి కారును నడిపిన ఫార్ములా వన్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.