దేవి మూవీలోని బుడ్డోడు గుర్తున్నాడా.? ఇప్పుడు హీరోలను మించే కటౌట్‌‌లా మారిపోయాడు

గ్రాఫిక్స్ ఉపయోగించి సినిమాలు తెరకెక్కించడంలో దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ దిట్ట.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు కోడి రామకృష్ణ. ఇక దేవి సినిమా సినిమా విషయానికొస్తే ఒక నాగు పాము కథతో ఈ సినిమాను రూపొందించారు. నాగ్ లోకం నుంచి భూలోకానికి వచ్చిన ఓ పాము మానవ రూపంలోకి మారడం.. ఒకరిని ప్రేమించడం పెళ్లాడటం, ఈ క్రమంలో విలన్ ను ఎదుర్కోవడం అనే కథతో అద్భుతంగా తెరకెక్కించారు కోడి రామకృష్ణ.

దేవి మూవీలోని బుడ్డోడు గుర్తున్నాడా.? ఇప్పుడు హీరోలను మించే కటౌట్‌‌లా మారిపోయాడు
Devi Movie
Follow us

|

Updated on: May 27, 2024 | 3:49 PM

ఫాంటసీ సినిమాలు ఇప్పటికంటే ఒకప్పుడు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి. భారీ వీఎఫ్ఎక్స్ లాంటివి లేని రోజుల్లోనే అప్పటి గ్రాఫిక్స్ ను ఉపయోగించి ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అలాంటి ఫాంటసీ మూవీస్ లో దేవి సినిమా ఒకటి. గ్రాఫిక్స్ ఉపయోగించి సినిమాలు తెరకెక్కించడంలో దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ దిట్ట.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు కోడి రామకృష్ణ. ఇక దేవి సినిమా సినిమా విషయానికొస్తే ఒక నాగు పాము కథతో ఈ సినిమాను రూపొందించారు. నాగ్ లోకం నుంచి భూలోకానికి వచ్చిన ఓ పాము మానవ రూపంలోకి మారడం.. ఒకరిని ప్రేమించడం పెళ్లాడటం, ఈ క్రమంలో విలన్ ను ఎదుర్కోవడం అనే కథతో అద్భుతంగా తెరకెక్కించారు కోడి రామకృష్ణ. ఈ సినిమాతోనే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ఇక ఈ సినిమాలో నటించిన అందరికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ ప్రేమ ఈ సినిమా తర్వాత చాలా పాపులర్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? దేవి మూవీలో విలన్ ఓ బాలుడి రూపంలోకి మారి హీరో ఫ్యామిలీని చంపాలని చూస్తాడు. ఆ బాలుడి పాత్రలో నటించింది ఎవరో తెలుసా.? అతను ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా.? ఆ చిచ్చర పిగుడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు.

ఆ చిన్నారి పేరు మాస్టర్ మహేంద్రన్. మహేంద్రన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేశాడు. పెళ్లి చేసుకుందాం, ఆహా, దేవి, లిటిల్ హార్ట్స్, నీ స్నేహం, వంటి చిత్రాల్లో నటించాడు. అంతే కాదు ఈ సినిమాల్లో దేవి, లిటిల్ హార్ట్స్ సినిమాలకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డులు కూడా అందుకున్నాడు. ఈ చిన్నడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు. మొన్నామధ్య తమిళ్ లో ఓ సినిమా కూడా చేశాడు. దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో యంగ్ విజయ్ సేతుపతి గా కనిపించాడు. ఈ కుర్రాడు ఇంతవరకు తెలుగులోకి అడుగుపెట్టలేదు. కానీ తమిళ్ లో సినిమా చేశాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మాస్టర్ మహేంద్రన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మాస్టర్ మహేంద్రన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు.. బరిలోకి ముగ్గురు మాన్‌స్టర్‌లు..
ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు.. బరిలోకి ముగ్గురు మాన్‌స్టర్‌లు..
మైనర్ బాలిక మిస్సింగ్.. ఇంటికి కూతవేడు దూరం ఊహించని పరిణామం..
మైనర్ బాలిక మిస్సింగ్.. ఇంటికి కూతవేడు దూరం ఊహించని పరిణామం..
మోహన్ బాబు వద్దన్న కథతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్..
మోహన్ బాబు వద్దన్న కథతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్..
ఫోన్‌ నెంబర్లకు ఛార్జీలు వసూలు చేయడంలో నిజమెంత.? ఇదీ క్లారిటీ...
ఫోన్‌ నెంబర్లకు ఛార్జీలు వసూలు చేయడంలో నిజమెంత.? ఇదీ క్లారిటీ...
అప్పుడే డ్యూటీ మొదలు పెట్టేసిన ఆ ఎంపీ.. అర్థరాత్రి అకస్మిక తనిఖీ
అప్పుడే డ్యూటీ మొదలు పెట్టేసిన ఆ ఎంపీ.. అర్థరాత్రి అకస్మిక తనిఖీ
ఫైనల్ మ్యాచ్‌ ఆడనున్న భారత్.. ఓపెనర్‌గా కోహ్లీ ఔట్..
ఫైనల్ మ్యాచ్‌ ఆడనున్న భారత్.. ఓపెనర్‌గా కోహ్లీ ఔట్..
ఒక్కరోజులోనే తిరుమల టూర్‌.. హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌ జర్నీ..
ఒక్కరోజులోనే తిరుమల టూర్‌.. హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌ జర్నీ..
బిగ్ బాస్ 8 హోస్ట్‌గా శివాజీ.. కంటెస్టెంట్స్‌కు చుక్కలే..
బిగ్ బాస్ 8 హోస్ట్‌గా శివాజీ.. కంటెస్టెంట్స్‌కు చుక్కలే..
'మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే వస్తుంది'..
'మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే వస్తుంది'..
సూపర్ 8లోకి తొలిసారి ఎంట్రీ.. కట్‌చేస్తే..
సూపర్ 8లోకి తొలిసారి ఎంట్రీ.. కట్‌చేస్తే..