- Telugu News Photo Gallery Cinema photos Photos of Mrunal Thakur in a glamorous look in a black dress
గ్లామర్ లుక్లో మృణాల్ .. ఈ బ్యూటీ అందం చూస్తే మతిపోవాల్సిందే!
అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో మాయ చేస్తుంది. బ్యూటిఫుల్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్ వేయండి.
Updated on: Apr 10, 2025 | 8:37 PM

బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. సీతారమం సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. సీత పాత్రలో నటించి తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

దీంతో ఈ అమ్మడుకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అంతే కాకుండా సీతారామం సినిమా తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు రావడంతో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

కానీ ముద్దుగుమ్మ చేసిన సినిమాల్లో హాయిన్ నాన్న, సీతారామం మాత్రమే నెటిజన్స్ ను ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ అందుకున్నాయి. ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీ చేసింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం వరసగా అవకాశాలు అందుకుంటూ.. సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో తన అందాలను ఆరబోస్తూ .. కుర్రకారు మదిని దోచేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



