Salaar Movie: సలార్ సిక్వెల్‌కు టైటిల్ ఇదే.. క్లైమాక్స్‌లో రివీల్ చేసిన నీల్..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ప్రకటన రావడంతో సలార్ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది. ఆ తర్వాత విడుదలైన పోస్టర్స్, టీజర్‌తో మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించాడు నీల్. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురూచూశారు ఫ్యాన్స్. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది సలార్. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్..
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేజీఎఫ్ 1, 2 సినిమాలతో ప్రేక్షకులకు కావాల్సినంత మాస్ ఎంటర్టై్న్మెంట్ అందించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సలార్. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు మరో కారణం ప్రభాస్. బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిన సంగతి తెలిసిందే. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉండిపోయారు. అదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ప్రకటన రావడంతో సలార్ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది. ఆ తర్వాత విడుదలైన పోస్టర్స్, టీజర్‌తో మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించాడు నీల్. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురూచూశారు ఫ్యాన్స్. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది సలార్. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్.. నీల్ తెరకెక్కించిన విధానం మైండ్ బ్లోయింగ్ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. అటు సినీ తారలు సైతం సలార్ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశారు నీల్. ఇప్పుడు సలార్ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడంతా సెకండ్ పార్ట్ పై మరింత హైప్ వచ్చింది. ఈ సినిమా కోసం ఇప్పుడు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సలార్ మొదటి భాగంలో ఖాన్సార్ ప్రపంచం.. అందులో ఉన్న వారంతా అక్కడి అధికారం కోసం కొట్టుకున్నట్లు.. పృథ్వీరాజ్ కూడా అధికారం కోసం ప్రభాస్ సాయం కోరినట్లు చూపించారు. తన స్నేహితుడి కోసం దేవా (ప్రభాస్) ఏం చేశాడనేది మొదటి పార్ట్ లో చూడొచ్చు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్ చేశాడు నీల్.
మొదటి భాగం సీజ్ ఫైర్ కాగా.. పార్ట్ 2కి ‘శౌర్యంగ పర్వం’ అనే టైటిల్ ను క్లైమాక్స్ వేశారు. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ఎవరు ?.. అతడికి పృథ్వీరాజ్‌తో శత్రుత్వం ఎలా వచ్చింది ?.. అసలు ఖన్సార్ కు రాజు ఎవరనేది సిక్వెల్ లో తెలియజేయనున్నారు. అంటే సలార్ అసలు కథ సెకండ్ పార్టులో ఉండబోతుంది. ఫస్ట్ పార్ట్ సలార్ కథకు కేవలం ఇంట్రో మాత్రమే అని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సలార్ రెండో భాగం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
The REBEL STORM has arrived💥
Watch #SalaarCeaseFire at your nearest cinemas! #BlockbusterSalaar #RecordBreakingSalaar#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur… pic.twitter.com/ydMfxmzKvw
— Hombale Films (@hombalefilms) December 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.