Guntur Karam: ‘గుంటూరు కారం’ సినిమాలో స్పెషల్ సాంగ్.. ఆ బ్యూటీకి లక్కీ ఛాన్స్ !..

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టా్ర్ట్ చేయనుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా గురించి నిత్యం ఏదోక న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతుంది.

Guntur Karam: 'గుంటూరు కారం' సినిమాలో స్పెషల్ సాంగ్.. ఆ బ్యూటీకి లక్కీ ఛాన్స్ !..
Guntur Karam
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2023 | 11:42 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటేస్ట్ సినిమా గుంటూరు కారం. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో మహేష్ జోడిగా మీనాక్షి చౌదరి, శ్రీలీల నటిస్తున్నారు. చాలా కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినా.. ఆలస్యంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టా్ర్ట్ చేయనుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా గురించి నిత్యం ఏదోక న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతుంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తోంది. అయితే ఇందులో పూజా హెగ్డే కనిపించనుందని ముందు నుంచి టాక్ వినిపిస్తుంది. కానీ లేటేస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం మరో బ్యూటీని ఎంపిక చేశారంట. ఆమె మరెవరో కాదు.. డింపుల్ హయాతి. గతంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలోనూ డింపుల్ స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టేసింది. ఆమె చేసిన జర్ర జర్ర పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు గుంటూరు కారం సినిమా కోసం ఆమెను తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. డింపుల్ హయాతికి ఇప్పటివరకు సరైన బ్రేక్ రావడం లేదు. 2017లో గల్ఫ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన క్రేజ్ రాలేదు. ఇటు తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా రావడం లేదు. దీంతో ఇప్పుడు మహేష్ నటిస్తోన్న గుంటూరు కారం సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ వస్తే.. డింపుల్ హయాతికి లక్కీ అంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.