Prabhas: కల్కి విడుదలకు ముందే విదేశాలకు ప్రభాస్.. ఎందుకంటే..

ఇక ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కల్కి స్టోరీ గురించి రివీల్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ షేర్ చేసిన రెండు వీడియోస్ చూస్తే సినిమా స్టోరీ పై మరింత ఆసక్తి కలుగుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ అంటూ ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ విషయంలో అభిమానులకు నిరాశే మిగిలింది.

Prabhas: కల్కి విడుదలకు ముందే విదేశాలకు ప్రభాస్.. ఎందుకంటే..
Prabhas
Follow us

|

Updated on: Jun 23, 2024 | 6:40 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ ప్రాజెక్ట్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటి కలిగిస్తే.. ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్స్ సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కల్కి స్టోరీ గురించి రివీల్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ షేర్ చేసిన రెండు వీడియోస్ చూస్తే సినిమా స్టోరీ పై మరింత ఆసక్తి కలుగుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ అంటూ ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ విషయంలో అభిమానులకు నిరాశే మిగిలింది.

ఇదిలా ఉంటే.. కల్కి విడుదలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ సమయంలో ప్రభాస్ విదేశాలకు వెళ్లబోతున్నట్లు సమాచరం.. వాస్తవానికి ప్రభాస్ తన ప్రతి సినిమాకు ముందు విదేశాలకు వెళ్తుంటాడు. గతంలో సలార్ సినిమా విడుదలకు ముందు ఇటలీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు కల్కి సినిమా విడుదలకు ముందు యూరప్ ట్రిప్ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

బాహుబలి హిట్ తర్వాత సాహో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు కూడా అభిమానులను నిరాశ పరిచాయి. కానీ గతేడాది విడుదలైన సలార్ మూవీ ప్రభాస్ అభిమానులను ఫుల్ ఖుషి చేసింది. చాలా కాలం తర్వాత ఈ మూవీతో ప్రభాస్ మాస్ నట విశ్వరూపంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు కల్కి సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఇందులో అమితాబ్, కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటానీ, శోభన, మాళవిక నాయర్, అన్నా బెన్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!