AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

సలార్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాడు డార్లింగ్. గతేడాది రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇటీవల విడుదలైన 'కల్కి 2898 ఏడి' చిత్రం కూడా వేల కోట్ల రూపాయలను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో ఆనందంలో మునిగితేలుతున్నాడు ప్రభాస్. ఇప్పుడు అతని రాబోయే సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈనేపథ్యంలో మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తోన్న చిత్రం ది రాజా సాబ్.

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
Prabhas The Raja Saab Movie
Basha Shek
|

Updated on: Jul 28, 2024 | 5:02 PM

Share

‘బాహుబలి 2 తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సాహో, రాధేశ్యామ్ ఆదిపురుష్..ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేశాడు. ఈ సినిమాలకు వందల కోట్లు కలెక్షన్లు వచ్చినా ప్రభాస్ అభిమానులకు సరైన మజాను అందించలేకపోయాయి. అయితే సలార్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాడు డార్లింగ్. గతేడాది రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 ఏడి’ చిత్రం కూడా వేల కోట్ల రూపాయలను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో ఆనందంలో మునిగితేలుతున్నాడు ప్రభాస్. ఇప్పుడు అతని రాబోయే సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈనేపథ్యంలో మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇందులో మాళవికా మోహనన్ హీరోయిన గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రభాస్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ‘ది రాజా సాబ్’ టీమ్ నుండి ప్రభాస్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ అందనుంది. ‘ది రాజా సాబ్’ సినిమా అప్‌డేట్‌ను నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. సోమవారం ( జూలై 29న) సాయంత్రం 5 గంటలకు ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అందులో ప్రకటించారు. ఇందులో ప్రభాస్ ఎలా కనిపించనున్నాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నాడు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ సినిమాల కంటే ‘ది రాజా సాబ్’ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశాడు. ఇప్పటికే అతని లుక్ రివీల్ అయింది. ఇప్పుడు ఓ స్పెషల్ వీడియోతో అభిమానులను అలరించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. గ్లింప్స్ గురించిన సమాచారం అందించడానికి విడుదల చేసిన పోస్టర్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ కూడా స్టైలిష్ గా ఉంది. ‘సలార్’, ‘కల్కి 2898 AD’ లాగానే ‘ది రాజా సాబ్’ పై కూడా అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి.

ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ నయా లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?