Radhe Shyam: దూసుకుపోతున్న ‘రాధేశ్యామ్’.. మూడు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది.
Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటించింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో డార్లింగ్ లుక్.. లొకేషన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ప్రేమకు విధికి మధ్య జరిగే వింత నాటకాన్ని ఈ సినిమా ద్వారా చూపించారు. దాదాపు మూడేళ్ళుగా ప్రభాస్ సినిమాకోసం ఎదురుచూసిన అభిమానులు రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంతమంది మాత్రం ఈ సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘రాధే శ్యామ్’ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 79 కోట్లు వసూలు చేసింది.
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత తమ చిత్రాన్ని హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ మూవీ. ఇక ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. మొత్తంగా వారాంతంలో ఈ మూవీ 151 కోట్లు వసూలు చేసిందని చిత్ర బృందం పేర్కొంది. అయితే తమిళంలో కూడా డబ్ చేసి విడుదలైన ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం అంతంత మాత్రంగానే వసూలు చేసింది. హిందీ వెర్షన్ కేవలం రూ 14 కోట్లను మాత్రమే సాధించింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదలైంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగు వెర్షన్‌కు ఎస్ఎస్ రాజమౌళి గొంతు సవరించారు. మొత్తంగా డివైడ్ టాక్ తోనూ వసూళ్ల పరంగా దూసుకుపోతుంది రాధేశ్యామ్.
A phenomenal response for #RadheShyam on the big screen with ₹ 151 cr gross in 3 days worldwide.#BlockBusterRadheShyam ❤️
Book your tickets now.#Prabhas @hegdepooja @director_radhaa @TSeries @UV_Creations @GopiKrishnaMvs @AAFilmsIndia @RedGiantMovies_ @RadheShyamFilm pic.twitter.com/EacIiQfnQ7
— Ramesh Bala (@rameshlaus) March 14, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :