AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: డార్లింగ్ ఈజ్ బ్యాక్.. పూర్తిగా సన్నబడ్డ ప్రభాస్.. కొత్త లుక్ చూశారా.. ?

త్వరలోనే సలార్ 2, స్పిరిట్, కల్కి 2 చిత్రాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇవే కాకుండా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రంలోనూ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ప్రభాస్.. బయట కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నారు.

Prabhas: డార్లింగ్ ఈజ్ బ్యాక్.. పూర్తిగా సన్నబడ్డ ప్రభాస్.. కొత్త లుక్ చూశారా.. ?
Prabhas
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2024 | 4:04 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు. ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ తర్వాత రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు ప్రభాస్. అలాగే కొన్ని రోజుల క్రితమే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంఛ్ అయ్యింది. ఇవి రెండు కాకుండా డార్లింగ్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సలార్ 2, స్పిరిట్, కల్కి 2 చిత్రాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇవే కాకుండా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రంలోనూ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ప్రభాస్.. బయట కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నారు.

డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో కనిపించిన ప్రభాస్.. మళ్లీ ఇప్పుడు కనిపించారు. తాజాగా శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా, సత్య ముఖ్య పాత్రలలో తెరకెక్కించిన మత్తు వదలరా 2 చిత్రం ట్రైలర్ ను ప్రభాస్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా మూవీ టీం అంతా ప్రభాస్ వద్దకు వెళ్లగా… వారితో మాట్లాడి మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు ప్రభాస్. అనంతరం చిత్రయూనిట్ ను అభినందించారు. అయితే మత్తు వదలరా మూవీ టీంతో ప్రభాస్ మాట్లాడుతున్న ఫోటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

అయితే ఆ ఫోటోల్లో ప్రభాస్ కాస్త సన్నబడ్డాడని.. పూర్తిగా డార్లింగ్ లుక్ మారిపోయిందంటున్నారు ఫ్యాన్స్. ఇటీవల తన ప్రాజెక్టులలో గంభీరంగా మంచి బాడీతో కనిపించిన ప్రబాస్.. ఇప్పుడు కొంచెం సన్నగా కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. డార్లింగ్ అసలు ఏ సినిమా కోసం సన్నబడ్డారు అని చర్చించుకుంటున్నారు. మరికొందరు డార్లింగ్ న్యూలుక్ అదిరిందని.. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ న్యూలుక్ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Prabhas New

Prabhas New

ఇదిలా ఉంటే.. ప్రభాస్ తెలుగుతోపాటు బాలీవుడ్ లోనూ ఓ మూవీ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుంత హిందీలో తెరకెక్కుతున్న సింగర్ అగైన్ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వచ్చే దీపావళికి విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ అతిథి పాత్రలో నటించనున్నారని టాక్.

Prabhas

Prabhas

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us