Prabhas: అనుకున్న సమయానికే ప్రేక్షకులముందుకు తీసుకువస్తాం.. ప్రభాస్ సినిమా పై నిర్మాత ఇంట్రస్టింగ్ కామెంట్స్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాధేశ్యామ్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సలార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రామాయణం నేపథ్యంలో ఉండనుందట. ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించనుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తుంది.
ఈ సినిమాలతోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్ ప్రాజెక్ట్ కే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, దీపికా పదుకొనె నటిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఈ సినిమా షూటింగు. విడుదల మరింత ఆలస్యం కానున్నట్టుగా టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అశ్వనీదత్ స్పందిస్తూ .. “ఈ సినిమా షూటింగు మరింత ఆలస్యం కానుందనే ప్రచారంలో నిజం లేదు. పరిస్థితులు చూసుకుని ఈ నెల చివరిలో మళ్లీ మొదలుపెట్టాలనుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంత వరకూ వచ్చే వేసవిలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే చేస్తున్నామని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :