AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: అలా జరగకుండా ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం.. చిరంజీవిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu on Chiranjeevi: సినిమా టిక్కెట్ల వివాదంలోకి కూడా తెలుగుదేశం పార్టీని ఎందుకు లాగుతున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu: అలా జరగకుండా ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం.. చిరంజీవిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu Naidu Chiranjee
Shaik Madar Saheb
|

Updated on: Jan 11, 2022 | 8:07 PM

Share

Chandrababu Naidu on Chiranjeevi: సినిమా టిక్కెట్ల వివాదంలోకి కూడా తెలుగుదేశం పార్టీని ఎందుకు లాగుతున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తంచేశారు. సినీ పరిశ్రమ తెలుగుదేశం పార్టీకి సహకరించింది లేదంటూ స్పష్టంచేశారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భనన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమ తమకెప్పుడు సహకరించలేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఈ మధ్య కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారంటూ పేర్కొన్నారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి (Chiranjeevi) పార్టీ పెట్టకముందు, పార్టీ పెట్టిన తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నారన్నారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగమని చంద్రబాబు స్పష్టంచేశారు. సినిమా టికెట్లపై మాట్లాడే ముఖ్యమంత్రి భవన నిర్మాణంపై ఎందుకు మాట్లాడరన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రోజు రాష్ట్రంలో సంతోషంగా సంక్రాంతి జరుపుకునే పరిస్థితి లేదంటూ పేర్కొన్నారు. కుప్పంలో 250 అక్రమ క్వారీలు నడుస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. సిబిఐ, ఈడీ కేసులను ఐటి క్లియరెన్స్ చేస్తే.. రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని తెలిపారు. ఊరుపేరు లేని వాళ్ళు కూడా తన మీద బాంబులు వేస్తానని అంటున్నారని.. ఇదేనా పాలన అంటూ ప్రశ్నించారు. కుప్పంలో అక్రమ మైనింగ్ చేసే భరత్ అనే వ్యక్తి కి ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. అక్రమ మైనింగ్ జరగలేదని విజయనగరం నుంచి ఒక మంత్రి వచ్చి సర్టిఫికెట్ ఇస్తున్నాడంటూ విమర్శించారు.

Also Read:

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య.. కత్తితో

Mahabubabad: భార్యాభర్తల మధ్య గొడవ.. ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలు బలి.!