Mahabubabad: భార్యాభర్తల మధ్య గొడవ.. ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలు బలి.!

మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న కలహాలు...

Mahabubabad: భార్యాభర్తల మధ్య గొడవ.. ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలు బలి.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 11, 2022 | 7:43 PM

మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న కలహాలు ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి.. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్ ముంబైలో సీర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పండుగ సెలవులపై ఇటీవల సొంత ఊరుకి వచ్చిన అతడు మూడు రోజుల క్రిందట భార్యతో ఘర్షణ పడ్డాడు. ఈ ఘర్షణ అనంతరం రామ్ కుమార్ భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక మర్నాడు ఉదయం అత్తగారింటికి వెళ్లిన రామ్ కుమార్ పిల్లలు అమ్మి జాక్సన్, జానీ బేస్టోలను తనతో పాటు బైక్ పైన పొలానికి తీసుకెళ్ళి.. వారిని వ్యవసాయ బావిలో పడేసి హత్య చేశాడు. అనంతరం రైల్వే గేటు సమీపంలో తాను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read:

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

ఈ పాము చాలా డేంజర్.. దీని వేట మాములుగా ఉండదు.. దొరికితే జ్యూస్‌లా చేసి తాగేస్తుంది!

 ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటల వికృత రాసలీలలు.. భార్యలను మార్చుకుంటూ..