Hero Prabhas Fans: ప్రభాస్‌ సినిమాలకు వ‌ర‌స‌ అడ్డంకులు.. ఫీలవుతున్న ఫ్యాన్స్..

మిగతా హీరోల మీద కాస్త తక్కువే అయినా... కోవిడ్ సెకండ్ వేవ్‌ ఎఫెక్ట్ డార్లింగ్ ప్రభాస్ మీద మాత్రం గట్టిగా పడింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల పనులు కరోనా కారణంగా ఆగిపోయాయి.

Hero Prabhas Fans:  ప్రభాస్‌ సినిమాలకు వ‌ర‌స‌ అడ్డంకులు.. ఫీలవుతున్న ఫ్యాన్స్..
Prabhas 1
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 28, 2021 | 7:12 PM

మిగతా హీరోల మీద కాస్త తక్కువే అయినా… కోవిడ్ సెకండ్ వేవ్‌ ఎఫెక్ట్ డార్లింగ్ ప్రభాస్ మీద మాత్రం గట్టిగా పడింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల పనులు కరోనా కారణంగా ఆగిపోయాయి. నాలుగూ భారీ చిత్రాలే కావటంతో ఈ డీలే రిలీజ్‌ డేట్స్ పై కూడా ప్రభావం చూపుతుందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్‌. స్టార్ హీరోలంతా సెట్స్ మీద ఉన్న సినిమా పూర్తయితేగాని మరో సినిమాను స్టార్ట్ చేయటం లేదు. కానీ ప్రభాష్ మాత్రం ఒకేసారి మూడు నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టేశారు. వీటిలో రాధేశ్యామ్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉండగా, సలార్‌, ఆదిపురుష్‌ సినిమాలు చిత్రీకరణ దశలో ఉంది. ఇక నాగ్‌ అశ్విన్‌దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉంది. అయితే ఈ నాలుగు సినిమాలకు కోవిడ్ సెకండ్ వేవ్‌ బ్రేక్‌ వేసింది. నిన్న మొన్నటి వరకు ముంబైలో ఆదిపురుష్‌ షూట్‌లో ఉన్నారు ప్రభాస్‌. కానీ అక్కడ లాక్‌ డౌన్‌ విధించటంతో ఆ షూటింగ్ ఆగిపోయింది. దీంతో హైదరాబాద్‌ వచ్చేసి రాధేశ్యామ్‌ వర్క్‌ స్టార్ట్ చేశారు. ఈ లోగా పూజా హెగ్డేకు పాజిటివ్‌ రావటంతో ఆ సినిమా వర్క్‌ కూడా ఆగిపోయింది.

సలార్‌ సినిమా అన్నా కంటిన్యూ చేద్దామా అంటే అదీ జరిగేలా లేదు… కర్ణాటక ప్రభుత్వం కూడా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో ప్రశాంత్‌ నీల్‌ కూడా ఫాం హౌజ్‌కు చేరిపోయారు. ఒకేసారి సెట్స్ మీద ఉన్న మూడు భారీ చిత్రాలకు బ్రేక్‌ పడటంతో ఆ ఎఫెక్ట్ తరువాత కాల్షీట్స్‌ అడ్జస్ట్‌మెంట్స్‌… రిలీజ్‌ డేట్స్ కూడా పడే ఛాన్స్‌ ఉందంటున్నారు విశ్లేషకులు.

సెట్స్ మీద ఉన్న సినిమాలు మాత్రమే కాదు ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉన్న సినిమాలకు కోవిడ్ షాక్‌ ఇస్తోంది. నాగ్‌ అశ్విన్‌తో భారీ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌లో నటించేందుకు ఓకే చెప్పారు ప్రభాస్‌. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరుగుతోంది. అయితే వందల మందితో భారీ సెట్స్ నిర్మించాల్సి ఉండటంతో ఆ వర్క్‌ను కూడా టెంపరరీగా ఆపేశారు. ఇలా అన్ని రకాలుగా ప్రభాస్‌ సినిమాలకు అడ్డంకులు ఎదురవుతుండటంతో ఫ్యాన్స్‌ కూడా ఫీలవుతున్నారు.

Also Read: మాజీ ప్రియుడు త‌నను సోష‌ల్ మీడియాలో బ్లాక్ చేశాడ‌ని.. ఆ మ‌హిళ ఊహించ‌ని ప‌ని చేసింది.. అంతా షాక్

ఏపీలో క‌రోనా క‌ల్లోలం.. కొత్తగా 14,669 కేసులు, 71 మరణాలు

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!