Kalki 2898 AD: వెయ్యిమంది రెబల్ స్టార్స్ కలిపితే మా బాబు ప్రభాస్.. శ్యామల దేవీ ఎమోషనల్ కామెంట్స్
ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. కోట్లాది రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన 'కల్కి 2898 AD' ఈరోజు (జూన్ 27) విడుదలై మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఫస్ట్ షో చూసిన చాలా మంది సినిమాపై బ్లాక్ బస్టర్ ఒపీనియన్స్ వ్యక్తం చేస్తూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు.
ప్రభాస్‌తో సహా భారతదేశంలోని బిగ్గెస్ట్ స్టార్ నటించిన నయా మూవీ కల్కి. ఇప్పుడు ఎక్కడ చూసిన కల్కి ఫీవర్ కనిపిస్తుంది. కల్కి సినిమా నేడు విడుదల కావడంతో దేశం మొత్తం ఊగిపోతోంది. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. కోట్లాది రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ ఈరోజు (జూన్ 27) విడుదలై మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఫస్ట్ షో చూసిన చాలా మంది సినిమాపై బ్లాక్ బస్టర్ ఒపీనియన్స్ వ్యక్తం చేస్తూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్స్ సీన్స్ హైలైట్ గా నిలిచాయని అంటున్నారు ఆడియన్స్.
సామాన్యుల నుంచి సినీ సెలబ్రెటీలు కూడా కల్కి సినిమాకు వీక్షిస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ కల్కి సినిమా చూశాడు.థియేటర్స్ దగ్గర అకీరా కనిపించడంతో ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తించారు. కల్కి టీ షర్ట్ వేసుకొని థియేటర్ కు వచ్చాడు అకీరా. అలాగే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ కూడా సినిమాను చూశారు.
ఇది కూడా చదవండి : రామ్ చరణ్ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె
ప్రభాస్ పెద్దమ్మ, స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవీ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో వీక్షించారు. ఆతర్వాత ఐమాక్స్ పరిసరాల్లో ఉంచిన బుజ్జి కారులో ఆమె కూర్చుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది చాలా పెద్ద పండుగ.. 1000 పెద్ద పండుగలను కలిపితే కల్కి పండగ అని అన్నారు శ్యామల దేవీ. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులకు, మా అభిమానులకు ధన్యవాదాలు. వెయ్యి రెబల్ స్టార్స్ కలిపితే మా బాబు ప్రభాస్ అని ఎమోషనల్ అయ్యారు శ్యామలాదేవి. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నింటిని తిరగరాస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కథ కలియుగం చివరలో జరుగుతుంది.. దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా 6000 సంవత్సరాల తర్వాత జరిగే కథ ఈ సినిమా.
ఇది కల్కి పండగ – శ్యామల గారు#KALKI2898AD pic.twitter.com/K0e2Hkpj22
— idlebrain.com (@idlebraindotcom) June 27, 2024
శ్యామలా దేవి రివ్యూ..
#Prabhas Looks & Visuals Vera Level lo unnaey! ❤️🔥🥹 #Kalki2898AD pic.twitter.com/gazqi5tr26
— . (@charanvicky_) June 27, 2024
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..