AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె బద్దలయ్యింది బంగారం..! యంగ్ హీరోతో కలిసి బాత్ టబ్‌లో హీరోయిన్ రచ్చ..

ఈ మధ్య కాలంలో కుర్రహీరోయిన్స్ హవా నడుస్తుంది. సినిమా సినిమాకు కొత్త కొత్త హీరోయిన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అలా ఈ మధ్య కాలంలో ఓ యంగ్ హీరోయిన్ గురించి కుర్రాళ్ళు తెగ గాలిస్తున్నారు. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది.

గుండె బద్దలయ్యింది బంగారం..! యంగ్ హీరోతో కలిసి బాత్ టబ్‌లో హీరోయిన్ రచ్చ..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: May 09, 2025 | 9:09 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్ బ్యూటీ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొంతమంది ఓవర్ నైట్ లో ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే కానీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందంతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది. ఏం అందం రా బాబు అంటూ కుర్రాళ్లందరూ  కళ్ళల్లో ప్రింట్ చేసుకున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె లేటెస్ట్ సెన్సేషన్, కుర్రకారు డ్రీమ్ గర్ల్. మీ ఎవరంటే..

ఆమె ఎవరో కాదు..డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్.  తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు, మరాఠీ చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ సొంతం చేసుకుంటుంది ఈ చిన్నది. కాయదు 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, 2021లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఎవరీయూత్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12 పోటీలో విజేతగా నిలిచింది ఈ అందాల భామ. 2021లో కన్నడ చిత్రం ముగిల్‌పేటతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తెలుగులో ఈ బ్యూటీ శ్రీవిష్ణు సరసన అల్లూరి సినిమాలో నటించింది.

ఇవి కూడా చదవండి

కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇక రీసెంట్ గా తమిళ్ మూవీ డ్రాగన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కట్టాయి. నాని సరసన పారడైజ్ చిత్రంలో నటిస్తుంది ఈ భామ. అలాగే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ అందుకుందని టాక్. ఇదిలా ఇదిలా ఉంటే యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ ను విడుదల చేశారు. బాత్ టబ్బులో హీరోతో పాటు ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే ఈ పోస్టర్ లో కాయదు చేతిలో మందు గ్లాస్ కూడా చూడొచ్చు. ఈ పోస్టర్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నిన్ను ఇలా చూస్తూ గుండె బద్దలయ్యింది అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.