AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరో.. కట్ చేస్తే.. స్టూడెంట్‏తో ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు ఇలా..

సినీరంగంలో ఎన్నో ప్రేమకథ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. అందమైన లవ్ స్టోరీస్, విభిన్న పాత్రలతో కోట్లాది మంది ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు. ముఖ్యంగా అతడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. ఇప్పటికీ ఎన్నో సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన ప్రేమ, పెళ్లి గురించిన సమాచారం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

Actor : ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరో.. కట్ చేస్తే.. స్టూడెంట్‏తో ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు ఇలా..
R.madhavan
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2026 | 5:21 PM

Share

సినీరంగంలోకి అతడు రొమాంటిక్ హీరో. చాక్లెట్ బాయ్ అంటూ అమ్మాయిల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. అప్పట్లో లవ్ స్టోరీ చిత్రాలతో మెప్పించాడు. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టకముందే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన నిజమైన ప్రేమకథ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తన ప్రేమ, పెళ్లి కథను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతడు 1970 జూన్ 1న జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జన్మించారు. ల్హాపూర్‌లోని రాజారామ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో తన విద్యను పూర్తి చేశారు. మహారాష్ట్రలోని అగ్రశ్రేణి ఎన్‌సిసి క్యాడెట్లలో ఒకరిగా, ఆయన బ్రిటిష్ సైన్యంలో కూడా శిక్షణ పొందారు. భారత సైన్యంలో చేరడం ఆయన కల. కానీ వయోపరిమితి కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో కొల్హాపూర్‌లోనే టాలెంట్ మేనేజ్‌మెంట్ ట్రైనర్‌గా పని చేయడం ప్రారంభించాడు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

అక్కడ అతడు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇచ్చేవాడు. అక్కడ ఒక కోర్సులో, ఎయిర్ హోస్టెస్ కావాలనే కల ఉన్న ఒక యువతిని అతను కలిశాడు. ఆ కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఎయిర్ హోస్టెస్ కావాలన్న ఆమె కల నిజమైంది. అదే సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న వారిద్దరూ తర్వాత పెద్దల సమక్షంలో 1991లో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అతడు మొదట్లో తమిళ చిత్రపరిశ్రమలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరెవరో కాదు..హీరో ఆర్. మాధవన్. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..

ఆర్. మాధవన్..ఆయన భార్య సరితా బిర్జే ఫేమస్ ఎయిర్ హోస్టె్స్. ఈ దంపతులకు వేదాంత్ అనే కుమారుడు ఉన్నారు. సినీరంగంలో కాకుండా మాధవన్ తనయుడు స్విమ్మింగ్ కాంపిటీషన్ లో ఎన్నో పతకాలు సాధించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

Madhavan

Madhavan

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

Follow Us
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!
ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!