AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money: ఈ చిన్న ట్రిక్‌ తెలిస్తే రోజూ రూ. 6 వేలు మీ సొంతం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే..

స్టాక్ మార్కెట్‌లో రోజుకు రూ. 5-6 వేలు సంపాదించడానికి కనీసం రూ. 1 లక్ష పెట్టుబడి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా ఇది సాధ్యమే, అయితే మార్కెట్‌పై సరైన అవగాహన, నాలెడ్జ్ ఉండాలి. రిస్క్ స్థాయిని బట్టి రిటర్న్స్ మారుతాయని..

Money: ఈ చిన్న ట్రిక్‌ తెలిస్తే రోజూ రూ. 6 వేలు మీ సొంతం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే..
Money
Ravi Kiran
|

Updated on: Apr 19, 2026 | 6:03 PM

Share

ప్రస్తుతం యువతలో స్టాక్ మార్కెట్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలనే ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా రోజువారీగా రూ. 5,000 నుంచి రూ. 6,000 సంపాదించి, నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని చేరుకోవడం సాధ్యమేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, ఈ మార్గాన్ని ఎంచుకునే వారు మార్కెట్ పరిస్థితులతో పాటు నష్టాలను కూడా ఎదుర్కొనేలా వ్యూహాలను కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

పెట్టుబడి రకాలు, వాటితో ముడిపడి ఉన్న రిస్క్ గురించివిశ్లేషిస్తూ.. సురక్షితమైన బ్యాంక్ డిపాజిట్ల నుంచి అత్యంత రిస్క్‌తో కూడిన ఆప్షన్స్ ట్రేడింగ్ వరకు వివిధ రకాలు ఉన్నాయని తెలిపారు. బ్యాంక్ డిపాజిట్లు లేదా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాల్లో రిస్క్ ఉండదు కానీ, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాటి నుంచి వచ్చే లాభం చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో స్టాక్ మార్కెట్, ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ‘అధిక రిస్క్ – అధిక లాభం’ అనే సూత్రంపై పనిచేస్తుంది. మార్కెట్ అవగాహన ఉన్నవారు ఒకే రోజులో పెట్టుబడికి మించిన లాభాలను ఆర్జించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.

మరోవైపు, భారత స్టాక్ మార్కెట్ ముఖచిత్రం గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా మారింది. సెబీ (SEBI) ఇటీవల ట్రేడింగ్‌లో లివరేజ్, ఎక్స్‌పోజర్ నియమాలను కఠినతరం చేసింది. దీనివల్ల గతంలో ఉన్నట్లుగా తక్కువ పెట్టుబడితో భారీ మొత్తంలో ట్రేడింగ్ చేయడం ఇప్పుడు సాధ్యం కాదు. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఇది ఇన్వెస్టర్ల భద్రతకు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. కేవలం అదృష్టాన్ని నమ్ముకుని కాకుండా, మార్కెట్ సబ్జెక్టును క్షుణ్ణంగా చదువుకుని ప్రవేశించడం ద్వారా మాత్రమే ఈ రంగంలో నిలదొక్కుకోగలరని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: ఇది ఒక్క చెంచా వేస్తే.. మందార మొక్క గుత్తులు గుత్తులుగా పువ్వులతో నిండిపోతుంది..

Disclaimer: స్టాక్ మార్కెట్, ఆప్షన్స్ ట్రేడింగ్ తీవ్రమైన ఆర్థిక నష్టభయంతో కూడుకున్నవి. ఇందులో లాభాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో, నష్టాలు కూడా అంతే వేగంగా సంభవించే అవకాశం ఉంటుంది. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం సమాచారం, అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు దయచేసి సెబీ(SEBI) రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి.

Follow Us
ఈ చిన్న ట్రిక్‌తో ప్రతీ రోజూ రూ. 6 వేలు సంపాదించవచ్చు..
ఈ చిన్న ట్రిక్‌తో ప్రతీ రోజూ రూ. 6 వేలు సంపాదించవచ్చు..
దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్..
దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్..
ఒక్క గ్లాస్‌తోనే మార్పు.. యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం దూరం
ఒక్క గ్లాస్‌తోనే మార్పు.. యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం దూరం
అవమానించిన చోటే.. ఒక్క పాటతో యూట్యూబ్ రికార్డులను తిరగరాశాడు..
అవమానించిన చోటే.. ఒక్క పాటతో యూట్యూబ్ రికార్డులను తిరగరాశాడు..
మీ కళ్లు ఎంత షార్ప్.? 10 సెకన్లలో పామును కనిపెట్టగలరా.!
మీ కళ్లు ఎంత షార్ప్.? 10 సెకన్లలో పామును కనిపెట్టగలరా.!
రాజస్థాన్ రాయల్స్ తడబాటు.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..!
రాజస్థాన్ రాయల్స్ తడబాటు.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..!
తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
వయసొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన మిల్లెట్స్ గంటి పిడికిళ్లు
వయసొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన మిల్లెట్స్ గంటి పిడికిళ్లు
ఉదయం Vs రాత్రి.. స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మంచిది..?
ఉదయం Vs రాత్రి.. స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మంచిది..?
అతడంటే అమ్మాయిలు పడిచచ్చిపోయేవారు.. స్టూడెంట్‏తో ప్రేమ, పెళ్లి..
అతడంటే అమ్మాయిలు పడిచచ్చిపోయేవారు.. స్టూడెంట్‏తో ప్రేమ, పెళ్లి..