AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : మరో ఉగ్ర రూపం వచ్చేస్తున్నాడు.. మహావతార్ నరసింహా తర్వాత ఈసారి అంతకు మించి..

గతేడాది జూలైలో మహావతార్ నరసింహా అనే యానిమేషన్ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. భక్త ప్రహ్లాద, హిరణ్య కశ్యపుడు, నరసింహావతారం కథను యానిమేషన్ లో చాలా గొప్పగా, ఎంతో అద్భుతంగా చూపించారు. కేవలం రూ.6 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈ మూవీ కనెక్ట్ అయ్యింది.

Tollywood : మరో ఉగ్ర రూపం వచ్చేస్తున్నాడు.. మహావతార్ నరసింహా తర్వాత ఈసారి అంతకు మించి..
Mahavatar Parshuraam
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2026 | 5:25 PM

Share

గత ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ‘మహావతార్‌ నరసింహ’. ఈ యానిమేషన్ చిత్రంతో థియేటర్లలో తుఫాను క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పుడు ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా మరో అద్భుతమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. గతంలో చెప్పినట్లుగానే విష్ణుమూర్తి దశావతారాలలో ఒక్కొ రూపాన్ని అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇందులో భాగంగానే విష్ణువు అత్యంత ఉగ్రరూపంగా భావించే పరశురాముడి కథాంశంతో ‘మహావతార్‌: పరశురామ్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడిస్తూ, తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన పోస్టర్‌లో పరశురాముడు తన ప్రధాన ఆయుధమైన పరశువు (గొడ్డలి)ని పట్టుకుని నడుస్తున్నట్లుగా చూపించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

అయితే, కేవలం పాదాలను మాత్రమే చూపిస్తూ మేకర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. “ధర్మం ఓడిపోయినప్పుడు, అన్యాయం పెరిగినప్పుడు పరశురాముడు వస్తాడు” అనే అర్థం వచ్చేలా ఉన్న క్యాప్షన్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. పరశురాముడి ఆవేశాన్ని, ఆయన ఉగ్రరూపాన్ని యానిమేషన్ టెక్నాలజీతో వెండితెరపై అత్యంత వైభవంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

‘మహావతార్‌ నరసింహ’ కేవలం 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, దాదాపు 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విజయంతో ఉత్తేజం పొందిన హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ ఈ భారీ సిరీస్‌ను ప్లాన్ చేశారు. అశ్విన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యూనివర్స్‌లో భాగంగా రాబోయే చిత్రాల వివరాలను కూడా మేకర్స్ ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మహావతార్‌: పరశురామ్‌ (డిసెంబర్ 2027)

మహావతార్‌: రఘునందన్‌ (2029)

మహావతార్‌: ద్వారకాదీశ్‌ (2031)

మహావతార్‌: గోకులానంద్‌ (2033)

మహావతార్‌: కల్కి (పార్ట్ 1 & 2 – 2035, 2037)

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..

యానిమేషన్ రంగంలో భారతీయ పురాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకురావడమే ఈ టీమ్ లక్ష్యంగా కనిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

Follow Us