AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Dreams: చెడు కలలు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్వప్నశాస్త్రం చెప్పే సులభ పరిహారాలు ఇవే!

Bad Dream Meaning: చెడు కలలు మనసులో భయాన్ని కలిగిస్తాయి. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి దుస్వప్నం దుష్ఫలితాన్ని సూచించదు. కల వచ్చిన సమయం, దాని అర్థం, అలాగే దోష నివారణకు పాటించాల్సిన ఆధ్యాత్మిక పరిహారాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి.

Bad Dreams: చెడు కలలు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్వప్నశాస్త్రం చెప్పే సులభ పరిహారాలు ఇవే!
Bad Dream Meaning
Rajashekher G
|

Updated on: Aug 06, 2026 | 6:03 PM

Share

Bad Dream Meaning Telugu: కలలు అనేవి మన జీవితంలో సహజమైన భాగం. అయితే కొన్ని కలలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని కలలు భయం, ఆందోళన, అసహజ భావాలను కలిగిస్తాయి. ముఖ్యంగా తనకు లేదా కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగినట్లు, మరణం, చీకటి ప్రదేశాలు, పాములు, రక్తం వంటి దృశ్యాలు కనిపిస్తే చాలామంది వాటిని దుస్వప్నాలుగా భావిస్తారు. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక ప్రత్యేకమైన సంకేతార్థం ఉంటుందని, అలాగే కల వచ్చిన సమయాన్ని బట్టి దాని ఫలితం మారుతుందని చెబుతారు.

కల వచ్చిన సమయాన్ని బట్టి ఫలితం

స్వప్నశాస్త్రం ప్రకారం రాత్రి మొదటి యామంలో వచ్చే కలల ఫలితాలు ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంటుంది. అర్థరాత్రి తర్వాత వచ్చే కలలు కొంత త్వరగా ఫలించవచ్చని చెబుతారు. అయితే తెల్లవారుజామున వచ్చే కలలు మాత్రం త్వరగా ఫలించే అవకాశముందని స్వప్నశాస్త్రంలో పేర్కొంటారు.

అన్ని చెడు కలలు నిజం కావు

ఒక విషయం గురించి రోజంతా ఎక్కువగా ఆలోచించడం, మానసిక ఒత్తిడి, అనారోగ్యం, భయం లేదా ఆందోళనలో ఉన్నప్పుడు అదే విషయాలు కలలో కనిపించడం సహజం. అలాంటి స్వప్నాలను శాస్త్రాలు దుష్ఫలితాల సూచనగా పరిగణించవు. కాబట్టి ప్రతి చెడు కలను భవిష్యత్‌కు సంకేతంగా భావించి భయపడాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

చెడు స్వప్నం వచ్చిన వెంటనే ఏమి చేయాలి?

స్వప్నశాస్త్రం ప్రకారం దుష్ఫలితాలను సూచించే కల వచ్చిన వెంటనే నిద్రలేచినట్లయితే, మనసును ప్రశాంతంగా ఉంచుకుని దుర్గాదేవిని స్మరించాలి. “ఓం దుం దుర్గాయై నమః” వంటి దుర్గా మంత్రాన్ని కొద్ది సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు. భయంతో ఆ కలను పదేపదే గుర్తుచేసుకోవడం లేదా అందరికీ వెంటనే చెప్పడం కంటే దేవుడిని ప్రార్థించడం ఉత్తమమని పెద్దలు చెబుతారు.

మరుసటి రోజు చేయాల్సిన పరిహారం

చెడు స్వప్న దోష నివారణ కోసం మరుసటి రోజు ఉదయం ఈ విధంగా చేయాలని జ్యోతిష్య సంప్రదాయంలో సూచిస్తారు.

  • ఉదయం తలస్నానం చేయాలి.
  • ఇంటి పూజా మందిరంలో ఇష్టదేవత లేదా దుర్గాదేవి ముందు దీపం వెలిగించాలి.
  • దీపానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం వంటి కనీసం మూడు రకాల నూనెలను కలిపి ఉపయోగిస్తే శుభప్రదంగా భావిస్తారు.
  • పూజ సమయంలో ఒక ఉప్పు ముద్ద, నిమ్మకాయ లేదా గుమ్మడికాయను దేవుడి ముందు ఉంచి, పూజ పూర్తయ్యాక వాటిని ఇంటికి దూరంగా విడిచిపెట్టడం లేదా పారవేయడం దు(చెడు)స్వప్న దోష పరిహారంగా కొందరు ఆచరిస్తారు.

ఆధ్యాత్మికంగా పాటించదగిన సూచనలు

దుస్వప్నాలు తరచూ వస్తుంటే ప్రతిరోజూ నిద్రకు ముందు కొద్దిసేపు దేవుని ధ్యానం చేయడం, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం లేదా దుర్గా స్తోత్రం పఠించడం మనసుకు ప్రశాంతతను ఇస్తుందని విశ్వసిస్తారు. అలాగే నిద్రించే గది పరిశుభ్రంగా ఉంచడం, సానుకూల వాతావరణాన్ని కల్పించడం కూడా మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన వివరాలు స్వప్నశాస్త్రం, జ్యోతిష్య సంప్రదాయాలు, ప్రజల్లో ప్రాచుర్యంలో ఉన్న విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉండవచ్చు. తరచూ భయంకరమైన కలలు వచ్చి మానసిక ఆందోళనకు గురిచేస్తే వైద్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)

Follow Us