AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: బెంగాల్‌లో ప్రచారం.. ఝల్‌మురి తింటూ ఆస్వాదించిన ప్రధాని మోదీ.. ఫొటోలు ఇదిగో

పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో బెంగాల్‌లో రాజకీయ హీటెక్కింది. ఎన్నికల ప్రచారంలో TMC, BJP దూకుడు పెంచాయి. డూ ఆర్‌ డై అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం బెంగాల్‌ను చుట్టుముట్టింది. బీజేపీ అగ్రనాయకత్వమే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన సీఎంలు బెంగాల్‌లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

PM Modi: బెంగాల్‌లో ప్రచారం.. ఝల్‌మురి తింటూ ఆస్వాదించిన ప్రధాని మోదీ.. ఫొటోలు ఇదిగో
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Apr 19, 2026 | 6:11 PM

Share

పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో బెంగాల్‌లో రాజకీయ హీటెక్కింది. ఎన్నికల ప్రచారంలో TMC, BJP దూకుడు పెంచాయి. డూ ఆర్‌ డై అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం బెంగాల్‌ను చుట్టుముట్టింది. బీజేపీ అగ్రనాయకత్వమే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన సీఎంలు బెంగాల్‌లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మమతా బెనర్జీ టార్గెట్‌గా నిప్పులు చెరిగారు. బెంగాల్‌ మహిళలను TMC మళ్లీ మోసం చేసిందని బంకురాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఫైర్ అయ్యారు. 33 శాతం రిజర్వేషన్‌ కావాలని బెంగాల్‌ మహిళలు కోరుకున్నారనీ, అది కూడా 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే అమల్లోకి రావాలని ఆశించారన్నారు. మహిళా రిజర్వేషన్‌ను కాంగ్రెస్‌తో కలిసి TMC కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కానీ బెంగాల్‌ బిడ్డలు ఎక్కువ సంఖ్యలో MLA, MPలు కావడం TMCకి ఇష్టం లేదన్నారు మోదీ. అలాంటి TMCకి ఓటు అనే ఆయుధంతో పెద్ద శిక్ష వేయాల్సిన సమయం వచ్చిందని మోదీ పిలుపునిచ్చారు.

ఝల్‌మురి తింటూ..

అయితే.. ఆదివారం నాడు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా నాలుగు ర్యాలీలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.. అయితే.. మధ్యలో ఝార్‌గ్రామ్‌లో రుచికరమైన ముర్మురాలు (ఝల్‌మురి)ని తింటూ ప్రధాని మోదీ ఆస్వాదించారు. ఝల్‌మురి (Jhal Muri) అనేది బెంగాల్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన స్పైసీ స్నాక్. ముర్మురాలు (పఫ్డ్ రైస్).. మసాలా.. ఉప్పు కారం.. తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి తయారు చేస్తారు.. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.. నాలుగు ర్యాలీల మధ్యలో ఝార్‌గ్రామ్‌లో రుచికరమైన ముర్మురాలు (ఝల్‌మురి)ని తిన్నానంటూ దానిలో పేర్కొన్నారు.

Follow Us
ఫ్రెండ్‌షిప్ డే.. మరో కొత్త వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
ఫ్రెండ్‌షిప్ డే.. మరో కొత్త వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?