AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీకెందుకు మ్యూజిక్ అన్నారు.. అవమానాల నుంచి పుట్టిందే ఆ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో దుమ్మురేపింది..

ప్రస్తుతం ఎన్నో పాటలు యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. అటు ఫోక్ సాంగ్స్.. ఇటు సినిమా పాటలు దూసుకుపోతున్నాయి. కానీ కోట్లాది మంది శ్రోతల హృదయాలు గెలుచుకున్న పాటలు ఎవరు రాశారు.. ? ఎవరు మ్యూజిక్ అందించారు ? అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు. కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన పాట... అనేక అవమానాల నుంచి పుట్టింది. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసుకుందామా.

నీకెందుకు మ్యూజిక్ అన్నారు.. అవమానాల నుంచి పుట్టిందే ఆ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో దుమ్మురేపింది..
Charan Arjun
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2026 | 5:49 PM

Share

ప్రస్తుతం యూట్యూబ్లో అనేక పాటలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పల్లె పాటలకు వచ్చే రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. అయితే కొన్నాళ్ల క్రితం ఒక పాట సంచలనం సృష్టించింది. మాస్ పాట కాదు.. కానీ ప్రతి ఒక్కరి మనసును కదిలించిన సాంగ్ అది. వింటున్న ప్రతిసారి వినాలనిపించే పాట.. ప్రతి చరణం ఎంతో సులభంగా పాడుకునేలా ఉండే పాట. ఇంతకీ ఆ పాట ఏంటీ..? రాసింది ఎవరు ? ఆ పాట వెనుక కథెంటో తెలుసుకుందామా. మనం మాట్లాడుకుంటున్న పాట పేరు ” నువ్వో రాయి నేనో శిల్పి”. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ఓ ఇంటర్వ్యూలో పుట్టుక, తన సినీ ప్రస్థానం, సవాళ్లు, రాజకీయాల ప్రభావంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పాట పుట్టిందని, ఇది తన జీవితానికి ఒక చిన్న గుర్తింపును తెచ్చిపెట్టిందని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

మ్యూజిక్ డైరెక్టర్‌గా తన ప్రయాణంలో ఎదురైన అడ్డంకులను చరణ్ అర్జున్ పంచుకున్నారు. “నీకెందుకు సంగీతం, నువ్వు పాటలు రాసుకో” అని చాలా మంది తనను నిరుత్సాహపరిచారని తెలిపారు. కొన్ని పరాజయ చిత్రాల వల్ల తన పేరుకు నష్టం వాటిల్లిందని, పెద్ద సినిమాల్లో తన ట్యూన్స్, కంపోజిషన్ ఉన్నా పేరు రాకపోవడం తనను బాధించిందని పేర్కొన్నారు. దీనితో తన పాటలను సినిమా ద్వారా కాకుండా యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తన పాటలు ఎమోషనల్‌గా, సినిమాలో పెట్టుకునేలాగే ఉంటాయని, అవి కేవలం ఫోక్ సాంగ్స్ కావని స్పష్టం చేశారు. తనను ఆపాలని చూసిన వారికి తన విజయం ఒక సమాధానమని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

రాజకీయ పార్టీలకు పాటలు రాయడంపై కూడా చరణ్ అర్జున్ ప్రస్తావించారు. తాను రాజకీయ నాయకులకు పాటలు రాసినందుకు ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదని, తన పాటలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాయని, తాను రాసిన వారంతా ముఖ్యమంత్రులయ్యారని సగర్వంగా చెప్పారు. నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోయింది. ఒక సాధారణ రాయిని శిల్పంగా మార్చాలంటే శిల్పికి ఎంత ఓర్పు, కళాదృష్టి ఉండాలో.. ఒక సామాన్యమైన వ్యక్తిని తన ప్రేమతో ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చడానికి ప్రేమికుడికి అంతే తపన ఉండాలని ఈ పాట ప్రబోధిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

Follow Us