Pooja Hegde: మూడేళ్లుగా ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించని పూజా హెగ్డే.. వెలుగులోకి అసలు విషయం!
కొన్ని సంవత్సరాల క్రితం వరకు టాలీవుడ్‌లో చాలా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. స్టార్ హీరోలతో కలసి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింందీ అందాల తార. అయితే గత మూడు సంవత్సరాలుగా ఈ బుట్టబొమ్మకు ఒక్క తెలుగు సినిమా ఆఫర్ కూడా రాలేదు.

హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు! అయితే దీనికి ఒక ప్రధాన కారణముందని తెలుస్తోంది. అదేంటంటే.. తెలుగు చిత్ర పరిశ్రమ పూజా హెగ్డేపై పరోక్షంగా నిషేధం విధించిందట. ఈ నిషేధం గురించి బహిరంగంగా ప్రకటించనప్పటికీ, అంతర్గత చర్చల ద్వారా చిత్ర నిర్మాతలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ నిషేధానికి అసలు కారణం పూజా హెగ్డే అధిక పారితోషికం అలాగే సెట్‌లో ఆమె డిమాండ్స్. గత సంవత్సరం, చిత్ర నిర్మాతలు ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడారు. సినిమా నటులు, నటీమణులు సెట్లలో సకల సౌకర్యాలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక రెమ్యునరేషన్లు ఇవ్వడంతో పాటు, భోజనం, వానిటీ వ్యాన్, జిమ్, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రస్సర్, టచ్-అప్ వంటి అనేక ఇతర సౌకర్యాలు కల్పించాలని తమ నిరాశను వ్యక్తం చేశారు. నిర్మాతలు ఈ ఫిర్యాదు చేయడానికి పూజా హెగ్డే కారణమని ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ కు దూరమైన పూజా హెగ్డే ఇప్పుడు తమిళ, హిందీ చిత్రాల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె నాలుగు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. సూర్య సరసన ‘రెట్రో’, రాఘవ్ లారెన్స్ ‘కాంచన 4’, దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ , రజనీకాంత్ ‘కూలీ’ చిత్రాలలో నటిస్తోందీ అందాల తార. ఇక ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే హిందీ సినిమాలోనూ పూజ నటిస్తోంది. వీటితో పాటు, పూజా హెగ్డే కూడా OTT అరంగేట్రం చేయనుంది. ఆమె ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నటించనుందని తెలుస్తోంది.
కూలి సినిమాలో పూజా హెగ్డే..
Yes, you guessed it right!❤️🔥 @hegdepooja from the sets of #Coolie @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv@girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/SThlymSeog
— Sun Pictures (@sunpictures) February 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




