Allu Arjun: హే క్యూటీ నువ్వా! అల్లు అర్జున్‌తో ఉన్న ఈ అందాల తారను గుర్తు పట్టారా? ఏ సందర్భంలో కలిశారంటే?
అల్లు అర్జున్ తో ఎంతో మంది హీరోయిన్లు పని చేశారు. అదితీ అగర్వాల్ మొదలుకుని రష్మిక మందన్నా వరకు చాలామంది స్టార్ హీరోయిన్లు బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఇందులో అల్లు అర్జున్ తో ఉన్న బ్యూటీ మాత్రం ఐకాన్ స్టార్ తో కలిసి నటించలేదు.

పై ఫొటోను గమనించారా? ఇందులో అల్లు అర్జున్ తో ఉన్నదెవరో గుర్తు పట్టరా? ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రెండింగ్ లో ఉంది. ఇటీవల ఆమె నటించిన ఒక సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగనీ ఆమె ఇందులో మెయిన్ హీరోయిన్ కాదు. అలాగనీ తీసిపారేసే రోల్ కూడా కాదు. గతంలో కేవలం రెండంటే రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ. తన అందం, అమాయకత్వంతో తెలుగు ఆడియెన్స్ ను ఇట్టే కట్టి పడేసింది. అయితే ఏమైందో ఏమో తెలియదు ఆ తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి పోయింది. మనసుకు నచ్చిన వాడిని మనువాడింది. విదేశాల్లోనే సెటిల్ అయ్యింది. అయితే ఇప్పుడు చాలామంది హీరోయిన్ల లాగే మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సుమారు 20 ఏళ్ల తర్వాత ఓ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తను మరెవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్.. ఆమె మరెవరో కాదు ఇటీవలే మజాకా సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అన్షు అంబానీ. ఇక పై ఫొటో విషయానికి వస్తే.. ఒక సినిమా ఈవెంట్ కు అల్లు అర్జున తో కలిసి హాజరైందీ అందాల తార. మజాకా రిలీజ్ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు అన్షు ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
సుమారు 20 ఏళ్ల క్రితం వచ్చిన నాగార్జున మన్మథుడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది అన్షు. మొదటి సినిమాతోనే అందం, అమాయకత్వంతోనే అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర మూవీలోనూ హీరోయిన్ గా నటించింది. మళ్లీ ఇప్పుడు మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ధమాకా ఫేం నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, రీతూ వర్మ హీరోయిన్లు గా నటించారు. అలాగే అన్షు, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఫిబ్రవరి 23న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సినిమాలో కామెడీ బాగా వర్కవుట్ అయ్యిందని, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారని రివ్యూలు వస్తున్నాయి.
కుటుంబ సభ్యులతో అన్షు..
View this post on Instagram
కాగా మజాకా హిట్ కావడంతో అన్షు రీ ఎంట్రీ ఘనంగా జరిగింది. మరి ఆమె ఇదే జోరును కొనసాగిస్తుందా? మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
మజాకా సినిమా ఈవెంట్ లో..
The ecstatic team of #Mazaka exudes love and gratitude towards audience at the Navvula Blockbuster Thanks Meet 😍🎪
Watch the Ultimate Fun Entertainer In Theaters Today 💥💥 — https://t.co/hh2LCCTmC1@sundeepkishan @riturv #RaoRamesh @AnshuActress @TrinadharaoNak1 @KumarBezwada… pic.twitter.com/VlqaEbcYC7
— AK Entertainments (@AKentsOfficial) February 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








