Pooja Hegde: సల్మాన్ ఖాన్‌తో పూజా హెగ్డే డేటింగ్ ?.. బుట్టబొమ్మ రియాక్షన్ ఏంటంటే..
గత కొద్ది రోజులుగా సల్మాన్, పూజా ప్రేమలో ఉన్నట్లు వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ పై పూజా స్పందించినట్లు తెలుస్తోంది.

ఏడాది కాలంగా పూజా హెగ్డే కలిసి రావడం లేదు. ఆమె నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయిన సంగతి తెలిసిందే. ఒక్క ఏడాదిలోనే దాదాపు తొమ్మిది ప్లాప్స్ ఖాతాలో వేసుకుంది. విజయ్ దళపతి సరసన బీస్ట్, ప్రభాస్ జోడిగా రాధేశ్యామ్ చిత్రాల్లో కనిపించినప్పటికీ ఈ మూవీస్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో పూజాకు తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఇది కాకుండా.. హిందీలో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా సల్మాన్, పూజా ప్రేమలో ఉన్నట్లు వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ పై పూజా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని..ఇప్పుడు తన ఫోకస్ పూర్తిగా సినిమాలపైనే ఉందని అన్నారు.
సల్మాన్ తో ప్రేమాయణంపై పూజా స్పందిస్తూ.. “రూమర్స్ పట్ల నేనేమి మాట్లాడగలను. నా గురించి అనేక వార్తలు చదువుతుంటాను. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉన్నాను.. నేను ఒంటరిగా ఉండేందుకు ఇష్టడతాను. అలాగే నా కెరీర్ పైనే నా దృష్టి ఉంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుంటాను. అన్ని ఇండస్ట్రీలలో వర్క్ చేస్తుంటాను. అందుకే నా గురించి వచ్చే ఈ రూమర్స్ ను పట్టించుకోలేను. ఎందుకంటే వాటిని నేనేం చేయలేను.” అని అన్నారు.




కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు పూజా హెడ్గా, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్ నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 21, 2023న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించగా.. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.