Pooja Hegde: బుట్టబొమ్మ స్టైల్ వేరు.. స్టైల్‌ అనేది మనం సెట్‌ చేసేదే అంటున్న పూజ హెగ్డే..

సెలబ్రిటీలు అనగానే ఒకసారి ధరించిన దుస్తులను ఇంకోసారి ధరించరా? ఒకవేళ ధరిస్తే తప్పా? అయినా ప్రతిరోజూ కొత్త కాస్ట్యూమ్స్ కావాలంటే కుదురుతుందా

Pooja Hegde: బుట్టబొమ్మ స్టైల్ వేరు.. స్టైల్‌ అనేది మనం సెట్‌ చేసేదే అంటున్న పూజ హెగ్డే..
Pooja Hegde
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 23, 2021 | 8:26 AM

Pooja Hegde

సెలబ్రిటీలు అనగానే ఒకసారి ధరించిన దుస్తులను ఇంకోసారి ధరించరా? ఒకవేళ ధరిస్తే తప్పా? అయినా ప్రతిరోజూ కొత్త కాస్ట్యూమ్స్ కావాలంటే కుదురుతుందా? నలుగురినీ ఇన్‌స్పయిర్‌ చేసే పొజిషన్‌లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీని గురించి మన గోపికమ్మ ఏం చెబుతున్నారు? డెనిమ్‌ స్కర్ట్ ని వీక్‌లో త్రైస్‌ రిపీట్‌ చేసి కొత్త ట్రెండ్‌ సెట్‌ చేశారు పూజా హెగ్డే. ఆల్రెడీ యూజ్డ్ డిజైన్స్ ని రిపీట్‌ చేయడం దీపిక, కరీనా లాంటి నార్త్ బ్యూటీస్‌కి కొత్తేం కాదు. కానీ మరీ ఒకే వారంలో మూడు సార్లు రిపీట్‌ చేసిన హిస్టరీ మాత్రం ఆ హీరోయిన్స్ ఖాతాలో లేదు. వాళ్లని బీట్‌ చేస్తూ, స్టైల్‌ అనేది మనం సెట్‌ చేసేదేగానీ, పూటకో డిజైనర్‌ వేర్‌ని యూజ్‌ చేసినంత మాత్రాన రాదు అని అంటున్నారు మోడ్రన్‌ శ్రీదేవి. రీసెంట్‌గా డెనిమ్‌ స్కర్ట్ మీద వైట్‌ టీ షర్ట్ తో రెండు చోట్లా, ఆరంజ్‌ ఓవర్‌ షర్ట్ తో ఇంకో ప్లేస్‌లోనూ పాపరాజీలకు ఫోజులిచ్చారు పూజా. ఫ్యాషన్‌ గోల్స్ రియలిస్టిక్‌గా ఉండాలన్న ఆమె కాన్ఫిడెన్స్ కి నెట్టింట్లో మంచి అప్లాజ్‌ వస్తోంది. ఇక పూజ హెగ్డే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది. అలాగే అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తమిళ్ లో విజయ్ తో ఓ సినిమా చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tollywood : టాలీవుడ్‌ను కాటేస్తున్న కరోనా మహమ్మారి… కోవిడ్‌తో తెలుగు ఇండస్ట్రీ ఎన్ని కోట్లు నష్టపోయిందంటే..!