Ram Charan : ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టునుంటావా అంటున్న మెగా పవర్ స్టార్

ఆ గట్టునుంటావా నాగన్న... ఈ గట్టునుంటావా అంటూ నిన్నటిదాకా డైలమాతోనే గడిపేశారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. కానీ.. ఆ గట్టూ ఈ గట్టూ కాదు ఏ గట్టునైనా నేనే వుంటా అనే క్లారిటీ

  • Rajeev Rayala
  • Publish Date - 9:00 am, Fri, 23 April 21
Ram Charan : ఆ గట్టునుంటావా నాగన్న... ఈ గట్టునుంటావా అంటున్న మెగా పవర్ స్టార్

Ram Charan : ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టునుంటావా అంటూ నిన్నటిదాకా డైలమాతోనే గడిపేశారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. కానీ.. ఆ గట్టూ ఈ గట్టూ కాదు ఏ గట్టునైనా నేనే వుంటా అనే క్లారిటీ వచ్చేసిందట చెర్రీకి. తెలుగుతోనే సరిపెట్టుకుంటే కుదరదని.. మిగతా మార్కెట్ల మీద ఫోకస్ పెట్టారు రంగస్థలం స్టార్. తన నెక్స్ట్ స్టాప్ చెన్నై అనేది చెర్రీ తాజా మాట. చిట్టిబాబుగా ఆస్కార్ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చావ్ అనే కాంప్లిమెంట్స్ అందుకున్న చెర్రీ.. తన రంగస్థలం మూవీని ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు. లేటెస్ట్ గా రంగస్థలం తమిళ్ వెర్షన్ ఏప్రిల్ 30న కోలీవుడ్ రిలీజ్ కి రెడీగా వుంది. తమిళ్ ట్రైలర్ ఇప్పటికే మెగా సర్కిల్స్ లో మోతెక్కిపోతోంది. రీసెంట్ గా కన్నడనాట కూడా రిలీజై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది చిట్టిబాబు రంగస్థలం.
పుష్పరాజ్ గా బన్నీని పాన్ ఇండియా హీరోగా పోట్రెయిట్ చేస్తున్న సుకుమారే రంగస్థలానికి కూడా డైరెక్టర్. క్వాలిటీ సినిమాకు కేరాఫ్ అనే ట్యాగ్ ని ఇలా తమిళ్, కన్నడ సర్కిల్స్ లో కూడా సంపాదించుకోబోతున్నారు సుక్కూ. అటు.. కోలీవుడ్ సెన్సేషన్ శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేస్తున్న చెర్రీ కూడా తమిళ్ రంగస్థలం ఎంతోకొంత ప్లస్సే అవుతుందనేది పాజిటివ్‌ సైన్‌!. ఇక చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ  చదవండి : 

Tollywood : టాలీవుడ్‌ను కాటేస్తున్న కరోనా మహమ్మారి… కోవిడ్‌తో తెలుగు ఇండస్ట్రీ ఎన్ని కోట్లు నష్టపోయిందంటే..!

Sarrainodu Movie: అల్లు అర్జున్‌ ‘సరైనోడు’కు ఐదేళ్లు.. రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన మూవీ

Vishnu Vishal, Jwala Gutta : డేటింగ్‌‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాల గుత్తా, విష్ణు విశాల్‌