Pooja Hegde: కోలీవుడ్‏లో బిజీగా పుజా హెగ్డే.. మరో స్టార్ హీరో పక్కన చాన్స్ కొట్టేసిన..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పూజా హెగ్డే హవా కొనసాగుతుంది. స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేస్తూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా

Pooja Hegde: కోలీవుడ్‏లో బిజీగా పుజా హెగ్డే.. మరో స్టార్ హీరో పక్కన చాన్స్ కొట్టేసిన..
Pooja Hegde

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పూజా హెగ్డే హవా కొనసాగుతుంది. స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేస్తూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా మారిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‏లలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు.. అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి విడుదలకు సిద్ధంగా ఉంది. అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రాధే శ్యామ్ మూవీలోనూ నటిస్తుంది. తెలుగులోనే కాకుండా.. తమిళ్‏లోనూ వరుస అవకాశాలను అందుకుంటోంది.

ఇప్పటికే తమిళ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో హీరోయిన్‏గా ఎంపికైంది. దీంతో ఈ మూవీ షూటింగ్‏లో జాయిన్ అయ్యేందుకు ఎంతో వెయిట్ చేస్తున్న అంటూ పలుమార్లు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో క్రేజీ చాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్‏లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించనుందట. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నేరుగా తెలుగులో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మరో వైపు బాలీవుడ్‏లో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది పూజా హెగ్డే.

Also Read: Rashmika Mandanna: నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న కూర్గ్ బ్యూటీ రష్మిక తాజా ఫోటో.. ఎందుకంటే..?

Biggboss telugu 5: ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ సిద్దమయ్యాడు.. సీజన్ 5 లోగో విడుదల

Sharddha Kapoor: వాట్సాప్‌లో శ్రద్ధా చాట్‌ పిక్స్ వైరల్.. ‘హార్ట్ సింబల్స్’తో సేవ్‌ చేసిన వ్యక్తి..?

Ram Gopal Varma: ‘హ్యాపీ ఎనిమీస్ డే ‘అంటూ రచలేపిన ఆర్జీవీ.. వైరల్ అవుతున్న వర్మ ట్వీట్..

Click on your DTH Provider to Add TV9 Telugu