Jaqueline Fernandez: ‘రక్కమ్మత్త’గా బాలీవుడ్ హీరోయిన్.. రంగమ్మత్తను మైమరపిస్తుందా ?

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Aug 02, 2021 | 7:28 AM

మెగా పవర్ స్టా్ర్ రామ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ మూవీలోని రంగమ్మత్త

Jaqueline Fernandez: 'రక్కమ్మత్త'గా బాలీవుడ్ హీరోయిన్.. రంగమ్మత్తను మైమరపిస్తుందా ?
Jaqueline Fernandez

Follow us on

మెగా పవర్ స్టా్ర్ రామ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ మూవీలోని రంగమ్మత్త పాత్ర తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. రంగమ్మతగా అనసూయ నటనకు మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. తాజాగా రంగమ్మత్త కాకుండా.. రక్కమ్మత్త పాత్ర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈసారి రక్కమ్మత్తగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలుగు ప్రేక్షకులను ఊరూతలుగించడానికి సిద్ధమైంది. కేవలం టాలీవుడ్‏లోనే కాకుండా.. 55 దేశాల్లో 14 భాషలలో రక్కమ్మగా రచ్చ చేయడానికి దూసుకొస్తుంది. ఇక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విషయానికి వస్తే.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడుకు సరైన గుర్తింపు రాలేదు. హీరోయిన్ గానే కాకుండా.. స్పెషల్ సాంగ్స్‏తోనూ స్టార్‏డమ్ తెచ్చుకొవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ మూవీతోనే జాక్వెలిన్ కన్నడ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. డైరెక్టర్ అనూప్ బండారి తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీని 3డీ షూట్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే… ఈ మూవీలోని రక్కమ్మ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. రక్కమ్మకు ఏది తెలియదో.. అసలు అది జగతిలో ఉండదు అంటూ సుదీప్ ఈ ఫస్ట్‌లుక్‌ని పోస్ట్ చేశారు ఈ సినిమాని జాక్ మంజునాథ్- శాలిని మంజునాత్ నిర్మిస్తున్నారు. నీతా అశోక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నిరూప్ బండారి, రవిశంకర్ గౌడ, వాసుకి వైభవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Pooja Hegde: కోలీవుడ్‏లో బిజీగా పుజా హెగ్డే.. మరో స్టార్ హీరో పక్కన చాన్స్ కొట్టేసిన..

Rashmika Mandanna: నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న కూర్గ్ బ్యూటీ రష్మిక తాజా ఫోటో.. ఎందుకంటే..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu