Nagarjuna Bangarraju: ఎట్టకేలకు ముహుర్తం ఫిక్స్.. సెట్స్ పైకి వెళ్లనున్న ‘బంగార్రాజు’..

అక్కినేని నాగార్జున్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. గత కొంత కాలంగా కింగ్ నాగ్..

Nagarjuna Bangarraju: ఎట్టకేలకు ముహుర్తం ఫిక్స్.. సెట్స్ పైకి వెళ్లనున్న 'బంగార్రాజు'..
Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 02, 2021 | 8:28 AM

అక్కినేని నాగార్జున్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. గత కొంత కాలంగా కింగ్ నాగ్.. సరైన్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఏ మూవీ చేసిన ఆశించినంత ఫలితం మాత్రం ఇవ్వడం లేదు. ఇటీవల వైల్డ్ డాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. కమర్షియల్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సినిమా చేస్తున్నాడు నాగ్. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదే కాకుండా.. నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ బంగర్రాజు సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. నాగార్జున, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సొగ్గాడే చిన్న నాయన సినిమా సూపర్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీకి సిక్వెల్ ఉండబోతుందని.. ఇందులో నాగ్ పాత్ర పేరు బంగార్రాజు అనే టైటిల్‏తో రాబోతుందని గతంలోనే ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడం కానీ.. ఇందులోని నటీనటుల గురించి ఎలాంటి అప్‏డేట్స్ చిత్రయూనిట్ నుంచి రాలేదు. గత కొన్ని రోజులుగా.. ఈ మూవీలో రమ్య కృష్ణ స్థానంలో శ్రియ శరణ్ నటించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక తాజా సమాచారం బంగార్రాజు సినిమాను ఈ నెల 20న ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోది. ఈ మూవీ షూట్ కోసం ఇప్పటికే ప్రత్యేకంగా సెట్ కూడా ఏర్పాటు చేశారట. ఇందులో నాగచైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక చైతూకు జోడీగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని కుదిరితే.. సాధ్యమైనంత తొందరగా ఈ మూవీని పూర్తి చేసి.. సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. సొగ్గాడే చిన్ని నాయన సినిమాను తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మరి నిజంగానే ఈ మూవీ ఇదే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుందా ? లేదా ? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read:

Karthika Deepam: మోనితను నిలదీసిన ప్రియమణి..దొరికిన ఆచూకీ.. అంజి కోసం బయలుదేరిన దీప!

Jaqueline Fernandez: ‘రక్కమ్మత్త’గా బాలీవుడ్ హీరోయిన్.. రంగమ్మత్తను మైమరపిస్తుందా ?

సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు