చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి.. అసలేం జరిగిందంటే

తాజాగా జ్ఞానవేల్ రాజా ఆయన భార్య నేహా పై పోలీసులకు ఫిర్యాదు అందింది. కొద్దీ రోజుల క్రితం జ్ఞానవేల్ రాజా ఇంట్లో నగదు పోయింది. అయితే జ్ఞానవేల్ రాజా భార్య నేహా పనిమనిషి పై అనుమానం వ్యక్తం చేసింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు నేహా. దాంతో పోలీసులు పనిమనిషి లక్ష్మీని విచారించారు

చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి.. అసలేం జరిగిందంటే
Gnanavel Raja
Follow us

|

Updated on: Apr 26, 2024 | 7:38 PM

నిర్మాత జ్ఞానవేల్ రాజా అనుకోని చిక్కుల్లో పడ్డారు. కోలీవుడ్ లో బడా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు జ్ఞానవేల్ రాజా. ఎన్నో అభూతమైన సినిమాలను నిర్మిచారు నిర్మాత జ్ఞానవేల్ రాజా. తాజాగా జ్ఞానవేల్ రాజా ఆయన భార్య నేహా పై పోలీసులకు ఫిర్యాదు అందింది. కొద్దీ రోజుల క్రితం జ్ఞానవేల్ రాజా ఇంట్లో నగదు పోయింది. అయితే జ్ఞానవేల్ రాజా భార్య నేహా పనిమనిషి పై అనుమానం వ్యక్తం చేసింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు నేహా. దాంతో పోలీసులు పనిమనిషి లక్ష్మీని విచారించారు. ఈ విచారణలో ఆమె ఎలాంటి దొంగతనం చేయలేదు అని పోలీసులకుతెలిపింది .

ఆతర్వాత పోలీసులు మరోసారి లక్ష్మీని విచారణకు పిలిచారు. దాంతో లక్ష్మీ మనస్థాపానికి చెంది ఆత్మహత్య  యత్నం చేసిందని తెలుస్తోంది. దాంతో స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. విచారణ పేరుతో పోలీసులు లక్ష్మీని చిత్రహింసలకు గురి చేశారని లక్ష్మీ కూతురు తెలిపింది. జ్ఞానవేల్‌రాజు భార్య నేహాపై లక్ష్మీ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన తల్లి ఎలాంటి దొంగతనం చేయకున్నా విచారణ పేరుతో ఆమెను చిత్రహింసలు చేశారని లక్ష్మీ కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే జ్ఞానవేల్‌రాజు భార్య నేహాపై లక్ష్మీ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఇప్పుడు ఈ టాపిక్ కోలీవుడ్ లో చర్చాంశనీయం అయ్యింది. కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ప్రస్తుతం సూర్య కంగువ, తంగలాన్ లాంటి సినిమాలను నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.