kushi movie: మళ్లీ కుమ్మేసింది భయ్యా.. నాలుగు రోజుల్లో ఖుషి సినిమా ఎంత వసూల్ చేసిందంటే
భూమిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా ఖుషి సినిమాను తాజాగా రీరిలీజ్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా ఖుషి సినిమాను తాజాగా రీరిలీజ్ చేశారు. ఖుషి సినిమా రిలీజ్ అయిన 22 ఏళ్ల తర్వాత ఖుషి సినిమాను రీరిలీజ్ చేశారు. న్యూ ఇయర్ కానుకగా పలు థియేటర్స్ లో ఖుషి సినిమా రీరిలీజ్ అయ్యింది.
ఈ సినిమాకు పవన్ ఫ్యాన్స్ మరోసారి బ్రహ్మరథం పట్టారు. ఖుషి సినిమా రీరిలీజ్ అయిన థియేటర్స్ లో రికార్డులు బద్దలు కొట్టింది. ముందుగా ఒక్క రోజే అనుకున్నారు. కానీ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూసి ఈ సినిమాను మరికొన్ని రోజులు పొడిగించారు . ఈ క్రమంలోనే ఇప్పుడు నాలుగు రోజులు పూర్తి చేసుకుంది ఖుషి.




తాజాగా ఖుషి సినిమా వరల్డ్ వైడ్ గా 4 కోట్లు వసూల్ చేసింది. నాలుగు రోజులకు ఖుషి సినిమా ఏ ఏ ఏరియాల్లో ఎంత వసూల్ చేసిందంటే.. నైజాం 1.62 కోట్లు, సీడెడ్ 0.48 కోట్లు, ఆంధ్ర 1.66 కోట్లు, ఏపీ- తెలంగాణ కలిపి 3.76 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.39 కోట్లు , ఓవర్సీస్ 0.18 కోట్లు, మొత్తం వరల్డ్ వైడ్ (టోటల్) 4.33 కోట్లు వసూల్ చేసింది ఈ మూవీ. ఇక ఇప్పటికి ఖుషి సినిమా పలు థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు.




