Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు ఇష్టమైన హీరోలు ఎవరో తెలుసా.. ఎన్టీఆర్, ప్రభాస్‌తోపాటు ఆ ఇద్దరూ కూడా..
ప్రస్తుతం పవన్ కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతున్నాయి. సినిమాలు వేరు. రాజకీయం వేరు.. సినిమా పరంగా రాష్ట్రంలోని యువత ఏ హీరోని అయిన ఇష్టపడడంలో తప్పులేదు.. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా ఒక్కచోటికి చేరాలన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. కొద్ది రోజులుగా సినిమా చిత్రీకరణలలో పాల్గొన్న ఆయన ఇప్పుడు వారాహి యాత్రలో ఉన్న సంగతి తెలిసింది. ఇటీవలే మొదలైన ఈ రాజకీయ ప్రచారంలో భాగంగా జూన్ 16న కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఈ యాత్రలో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. నిన్న యువతను ఉద్దేశిస్తూ సినిమాలు, స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతున్నాయి. సినిమాలు వేరు. రాజకీయం వేరు.. సినిమా పరంగా రాష్ట్రంలోని యువత ఏ హీరోని అయిన ఇష్టపడడంలో తప్పులేదు.. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా ఒక్కచోటికి చేరాలన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం యువత అంతా ఒక్కటై ఆలోచించాలని అన్నారు. తన తోటి నటీనటులంటే తనకెంతో గౌరవం ఉందని.. వారి సినిమాలను కూడా చూస్తానని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.




ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఇప్పటికే బ్రో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
Appeal to All Fandoms from Janasena Chief Pawan Kalyan.#VarahiVijayaYatra pic.twitter.com/XYKKEDT8zG
— Raees (@RaeesHere_) June 16, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




