Hari Hara Veera Mallu: సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ అప్డేట్.. హరిహర వీరమల్లు నుంచి పవన్ పాడిన సాంగ్ ప్రోమో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్.. మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో హరిహర వీరమల్లు ఒకటి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో హరి హర వీరమల్లు ఒకటి. ఈ చిత్రానికి ముందుగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి తొలి పాట మాట వినాలి ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పాటను విడుదల చేయకుండా.. ఈ పాటలో ‘వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి’ అని పవన్ చెప్పిన డైలాగ్ ను రిలీజ్ చేశారు.
ఇందుకు సంబంధించిన పూర్తి పాటను జనవరి 17న ఉదయం పది గంటల 20 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడడం విశేషం. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాకు ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్ ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుడంగా.. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
తొలి భాగాన్ని హరిహర వీరమల్లు 1ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతోపాటు పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..