Betting Apps Case: అన్వేష్‌పై చర్యలు తీసుకోండి సీఎం గారూ.. బోరున విలపించిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. వీడియో
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. విచారణంలో భాగంగా ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. అలాగే పలువురిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి స్టేట్ మెంట్స్ కూడా రికార్డు చేస్తున్నారు.

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. వీటిని ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే విష్ణు ప్రియ, రీతు చౌదరి తదితర సినీ తారలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంతో సంబంధమున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరూ సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తప్పుచేశామని ఒప్పుకుంటూ పోలీసులకు తగిన వివరణ ఇస్తున్నారు. కాగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించిన కేసులో ప్రముఖ యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో అతను పలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కొన్ని వీడియోలను బయట పెట్టాడు. దీంతో ఇమ్రాన్ పై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు. అందులో తనపై, తన తల్లిపై నడుస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడీ యూట్యూబర్. ఇందుకు కారణమైన అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిన కోరాడు.
‘నా తల్లిని ఉద్దేశించి అనవసరంగా వ్యాఖ్యలు చేయడం బాధించేస్తోంది. ఇది వ్యక్తిగత విమర్శలకు, కుటుంబ సభ్యులను లాగడానికి చాలా దారుణమైన ఉదాహరణ. అన్వేష్ సోషల్ మీడియాలో ఎన్నో లక్షల మంది ముందు నా తల్లిని దూషించాడు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఈ పోస్టుకు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా జత చేశారు.
ఇమ్రాన్ ఖాన్ షేర్ చేసిన వీడియో..
View this post on Instagram
కాగా తన తండ్రి బతికే ఉంటే.. చనిపోయాడని చెప్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు ఇమ్రాన్ బాయ్స్. పెద్ద వాళ్లు ప్రమోట్ చేశారనే తాను కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని అతను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఇమ్రాన్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరు బెట్టింగ్ యాప్స్ విషయంలో అతనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి