Prabhas: ప్రభాస్ రేంజ్ అంటే ఇదే మరీ.. విడుదలకు ముందే రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘సలార్’..
కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ పెంచేయగా.. కొద్ది రోజులుగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత మాత్రం హిట్స్ అందుకోవడం లేదు. ఆ తర్వాత వచ్చిన సాహో.. రాధేశ్యామ్ చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో డార్లింగ్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. దీంతో తమ అభిమాన హీరో నెక్ట్స్ మూవీస్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రం వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ పై విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇక ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ చిత్రంపైనే ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ పెంచేయగా.. కొద్ది రోజులుగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.
భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులు రికార్డ్ స్థాయికి సేల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు అభిమానులు. విడుదలకు ముందే సలార్ ఓవర్సీస్ హక్కురులు రూ. 90 కోట్లు అని.. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు ఇంత మార్జిన్ తో ఓవర్సీస్ రైట్స్ రాలేదని అంటున్నారు. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి 2 ఓవర్సీస్ హక్కులు రూ. 70 కోట్లు అమ్ముడు పోయాయి. కాగా గ్రామీ, ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సైతం రూ. 68 కోట్లకు సేల్ అయ్యింది. అయితే సలార్ ఓవర్సీస్ హక్కులు మాత్రం రూ. 90 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో డిజాస్టర్స్ వచ్చినా.. ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తుండగా.. మరోవైపు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె చిత్రాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఆదిపురుష్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




