Vijay Deverakonda: సుకుమార్.. విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడేనా ?..
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం ఇటు సౌత్ ఆడియన్స్ ను మాత్రమే కాదు.. అటు నార్త్ అడియన్స్ను సైతం ఫిదా చేసింది. ఇక ఇప్పుడు ఆయన పుష్ప 2 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ సుకుమార్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం ఇటు సౌత్ ఆడియన్స్ ను మాత్రమే కాదు.. అటు నార్త్ అడియన్స్ను సైతం ఫిదా చేసింది. ఇక ఇప్పుడు ఆయన పుష్ప 2 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. చాలా నెలల క్రితమే వీరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమా ఇంకా ఆన్ లోనే ఉందని చెబుతున్నారు మేకర్స్. అయితే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ రూమర్స్ అవాస్తవమని ప్రొడక్షన్ టీమ్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభంకానుందని.. ప్రస్తుతం సుకుమార్ రూపొందిస్తున్న పుష్ప 2 రిలీజ్ అనంతరం.. వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. దీంతో రౌడీ హీరో ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం విజయ్.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రం చేస్తున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తుండగా.. ప్రస్తుతం కేరళలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథా చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో సామ్, విజయ్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. అటు సుకుమార్ పుష్ప 2 చిత్రీకరణతో.. ఇటు విజయ్ ఖుషి సినిమాతో బిజీగా ఉండడం వల్ల వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ కాస్త్ ఆలస్యం అయ్యేలా ఉందట. ఈ సినిమా ఇంకా ఆన్ లో ఉందని తెలిసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.