- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu New Look of SSMB28 goes trending in social media on 06 04 2023 Telugu Heros Photos
Mahesh Babu: ఆ స్టైలు, హ్యాండ్సమ్‌కు ఫిదా అవ్వాల్సిందే బాస్..! సూపర్‌స్టార్ మెస్మరైజ్ లుక్
ఎంతైనా సోషల్ మీడియా సూపరబ్బా..! అది ఎప్పుడూ వంద కాలాలు ఇలాగే ఉండాలబ్బా..! అదే నా కోరికబ్బా..! ఎందుకబ్బా అని అంటారా..?ఎందుకంటే ప్రిన్స్ నయా నయా స్టన్నింగ్ లుక్స్‌ను ఎప్పటికప్పుడు చూపిస్తుంది కాబట్టి..! ఇప్పుడు కూడా ఇదే చేసిందబ్బా..!
Updated on: Apr 07, 2023 | 6:19 AM

ఎంతైనా సోషల్ మీడియా సూపరబ్బా..! అది ఎప్పుడూ వంద కాలాలు ఇలాగే ఉండాలబ్బా..! అదే నా కోరికబ్బా..! ఎందుకబ్బా అని అంటారా..?

ఎందుకంటే ప్రిన్స్ నయా నయా స్టన్నింగ్ లుక్స్‌ను ఎప్పటికప్పుడు చూపిస్తుంది కాబట్టి..! ఇప్పుడు కూడా ఇదే చేసిందబ్బా..!

టాలీవుడ్ లోనే మోస్ట్ హ్యాండమ్ లుక్స్‌తో.. అందర్నీ ఫిదా చేసే మహేష్ బాబు.. ఎట్ ప్రజెంట్ త్రివిక్రమ్ మూవీ షూట్లో బిజీ గా ఉన్నారు.

తన డైరెక్షన్లో తెరకెక్కుతోన్న SSMB28 సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. అతి త్వరలోనే ఆ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ వెంటనే పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి సినిమా సెట్‌కు షిఫ్ట్ కానున్నారు. ఇక ఈ క్రమంలోనే తన SSM28 లుక్స్‌తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు మహేష్.

ఎస్ ! సినిమాల విషయంలో పెద్దగా మేకోవర్ ట్రై చేయని మహేష్.. తాజాగా చేస్తున్న త్రివిక్రమ్ మూవీ కోసం.. స్లిమ్ లుక్‌లోకి ట్రాన్స్ ఫాం అయ్యారు.

దాంతో పాటే లాంగ్ హెయిర్‌లో మరింత హ్యాండ్‌సమ్‌గా మేకోవర్ అయ్యారు. ఇదే హెయిర్ స్టైల్‌తో.. బయట కూడా కనిపిస్తున్నారు.సినిమాలో మరోలా కనిపించే ఛాన్స్ ఉందని.. నిన్న మొన్నటి వరకు నెట్టింట కామెంట్ వచ్చేలా చేసుకున్నారు.

కానీ తాజాగా ఈ సినిమా షూట్ నుంచి కొన్ని ఫోటోలు మహేష్ SSMB28 లుక్స్ ఫిక్స్ అనే ట్యాగ్‌తో.. షూట్ నుంచి బయటికి వచ్చిన ఈ ఫోటోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.మేచోమ్యాన్ అనే నయా టైటిల్ వచ్చేలా చేసుకుంటున్నారు మహేష్.




