Nayanthara: ఫోటో తీస్తే ఫోన్ పగలగొట్టేస్తా.. అభిమానికి నయన్ వార్నింగ్..
ఈ క్రమంలోనే నిన్న నయన్ తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి కుంభకోణం సమీపంలోని కులదేవుడి ఆలయాన్ని సందర్శించారు. ఈ దంపతులకు అభిమానులు.. అక్కడి అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరిద్దరు కుంభకోణం పక్కనే ఉన్న మేళవత్తూరు గ్రామంలోని నది ఒడ్డున
సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో నయనతార ఒకరు. లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలిచుకునే నయన్.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ జోడిగా జవాన్ చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే నిన్న నయన్ తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి కుంభకోణం సమీపంలోని కులదేవుడి ఆలయాన్ని సందర్శించారు. ఈ దంపతులకు అభిమానులు.. అక్కడి అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరిద్దరు కుంభకోణం పక్కనే ఉన్న మేళవత్తూరు గ్రామంలోని నది ఒడ్డున ఉన్న తమ కులదేవత కామత్షి అమ్మాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయితే అదే సమయంలో నయనతారతో ఫోటోస్ దిగేందుకు అభిమానులు దూసుకువచ్చారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతుండగా.. ఓ అమ్మాయి నయన్ భూజాన్ని పట్టుకుని లాగింది. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేసింది. స్వామి పూజా చేసేందుకు వచ్చాం.. మాకు సహకరించండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది నయన్.
అనంతరం నయన్ దంపతులు తిరుచ్చి రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. అక్కడ కూడా అభిమానుల తీరుతో అసహనానికి గురైంది. ట్రైన్ లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. సెల్ఫీ తీసుకుంటూ నయన్, విఘ్నేష్ శివన్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన నయన్.. ఫోటో తీస్తే ఫోన్ పగలగొట్టేస్తాను అంటూ అభిమానికి వార్నింగ్ ఇచ్చింది. నిన్న దైవ దర్శనానికి వెళ్లిన అన్ని చోట్ల నయన్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.