Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాకు రామ్ చరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదా ?.. శంకర్ ఎవరీ కోసం కథ రాసుకున్నారో తెలుసా..
ఇక ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ కథ కోసం డైరెక్టర్ శంకర్ ఫస్ట్ ఛాయిస్ శంకర్ కాదట. మరో టాలీవుడ్ హీరో కోసం ఈ స్టోరీని క్రియేట్ చేయగా.. చివరకు చెర్రీని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటిసారి పూర్తిస్థాయి పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో చెర్రీ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీకైన ఫోటోస్.. వీడియోస్ సినీప్రియులకు ఆసక్తిని పెంచేశాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమ బ్యానర్ పై 50వ సినిమాగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ కథ కోసం డైరెక్టర్ శంకర్ ఫస్ట్ ఛాయిస్ శంకర్ కాదట. మరో టాలీవుడ్ హీరో కోసం ఈ స్టోరీని క్రియేట్ చేయగా.. చివరకు చెర్రీని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా.
డైరెక్టర్ శంకర్ ఈ కథను ముందుగా దిల్ రాజుకు నరేట్ చేసినప్పుడు ఈ స్టోరీ పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ కి బాగుంటుందని చెప్పారట. కానీ ఆ తర్వాత పవన్ కాకుండా.. చరణ్ ఈ స్టోరీకి బాగుంటుందని దిల్ రాజు సలహా ఇవ్వడంతో.. శంకర్ మార్చుకున్నారట. అలా పవన్ చేయాల్సిన గేమ్ ఛేంజర్ చరణ్ చేస్తున్నాడని తెలుస్తోంది. అంటే ఈ సినిమా కోసం శంకర్ ఫస్ట్ ఛాయిస్ చరణ్ కాకుండా.. పవర్ స్టార్. ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. ఓ వైపు రాజకీయాల్లో పవన్ చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇప్పటివరకు చరణ్ ప్రత్యేక్షంగా రాజకీయాల్లో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు ఇలా వెండితెరపై పొలిటికల్ లీడర్ గా కనిపించనుండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.