Dasara Movie: దసరా దర్శకుడికి BMW కారు గిఫ్ట్‌ ఇచ్చిన నిర్మాత.. ధర ఎంతో తెలుసా.?

న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఏకంగా రూ. 100 కోట్ల రాబట్టి ఆల్‌టైమ్‌...

Dasara Movie: దసరా దర్శకుడికి BMW కారు గిఫ్ట్‌ ఇచ్చిన నిర్మాత.. ధర ఎంతో తెలుసా.?
Dasara Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 06, 2023 | 3:04 PM

న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఏకంగా రూ. 100 కోట్ల రాబట్టి ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌ దిశగా దూసుకుపోతోంది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిందీ మూవీ. తొలి సినిమానే అయిన మేకింగ్ విషయంలో శ్రీకాంత్ తనైదన మార్క్‌ను చూపించాడు. పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మాస్‌ మూవీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా కరీంనగర్‌లో విజయోత్సవ వేడకను నిర్వహించారు. ఈ వేదికగానే చిత్ర నిర్మాత చెరుకూరి సుధాకర్‌ చిత్రబృందానికి బహుమతులు ఇచ్చారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ కారు ధర రూ. 80 లక్షల వరకు ఉండొచ్చని అంచనా అలాగే సినిమాకోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ.. 10 గ్రాముల బంగారు నాణెలను ఇచ్చారు.

ఇక కరీంనగర్‌లో జరిగిన ఈవెంట్‌లో నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కరీంనగర్‌ ఎనర్జీ అద్భుతంగా ఉందన్నారు. కరీంనగర్‌లో అద్భుతమైన అభివృద్ధితోపాటు ప్రకృతి రమణీయత ఆకట్టుకుందని.. త్వరలోనే ఇక్కడ షూటింగ్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సక్సెస్‌ మీట్‌ కార్యక్రమానికి దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల, మేయర్‌ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, ఎడిటర్‌ నవీన్‌, ప్రముఖ నటుడు దీక్షిత్‌, దాసర్ల శ్యామ్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర