AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam: తెలుగు మట్టి నుంచి పుట్టిన చిత్రం… ఆస్కార్ దారిలో బలగం..

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన యాభైకి పైగా చిత్రాలను నిర్మించాడు. టాలీవుడ్‌లోని అందరూ టాప్ యాక్టర్స్‌తో కలిసి పనిచేశాడు. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న బాలగం చిత్రాన్ని దిల్ రాజు కుమార్తె, మేనల్లుడు నిర్మించారు. ఇది చిన్న బడ్జెట్ చిత్రం అయినప్పటికీ అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంది.

Balagam: తెలుగు మట్టి నుంచి పుట్టిన చిత్రం... ఆస్కార్ దారిలో బలగం..
Balagam Movie
Ram Naramaneni
|

Updated on: Apr 06, 2023 | 5:35 PM

Share

బలగం సినిమా… బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఓ పక్క ఓటీటీలో ఉన్నా.. కూడా.. థియేటర్లలో కిక్కిరిసి మరీ చూస్తున్న జనాల మనసులను గెలుచుకుంటూ పోతోంది. ఊర్లలో తెరలు కట్టుకుని మరీ.. కలిసి కట్టుగా చూసే సినిమాగా మారిపోయింది. పిల్లా జల్లా ముసలీ ముతకా.. ఇలా అందర్నీ ఆకట్టుకుంటోంది. వారిలో మనసు లోతుల్లోని భావోద్వేగాలను తట్టి లేపుతుంది. మనుషుల మనస్తత్వాలను నిక్కచ్చిగా మరో సారి మనకి తెలియజేసింది ఈ సినిమా. ఇక దాంతో పాటే.. ఇప్పుడు గ్లోబల్‌ రేంజ్లో కూడా బజ్ చేస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న బలగం.. తాజాగా ఆస్కార్ దారిలో పయనిస్తోంది.

కమెడియన్ జబర్దస్త్‌ వేణు డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ బలగం.! ఎలాంటి అంచనాలు లేకుండా చాలా చిన్న సినిమాగా రిలీజ్‌ అయిన ఈసినిమా ఇప్పుడు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. బిగ్ హిట్ గా మారింది. అంతేకాదు.. ఇటీవల లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో బెస్ట్ పీచర్ ఫిల్మ్‌.. అండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీగా కేటగిరీల్లో అవార్డు అందుకుంది. ఇక ఆ తరువాత వాషింగ్‌ టన్ డీసీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏకంగా 4 కేటగిరీల్లో అవార్డు అందుకుంది. ఇలా ఈ సినిమా గ్లోబల్‌ రేంజ్ లో బజ్ చేయడం మొదలెట్టి.. ఇప్పుడు మరిన్ని అవార్డ్స్‌ అందుకునేలా కనిపిస్తోంది. ట్రిపుల్ ఆర్ దారిలోనే నడుస్తుంది.

ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను ఆస్కార్ బరిలో దించేందుకు ట్రై చేస్తున్నామని.. అందుకోసం బడ్జెట్‌ను కూడా కేటాయించేందుకు రెడీగా ఉన్నామని ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పడం అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ట్రిపుల్ ఆర్ తరువాత తెలుగు నుంచి ఆస్కార్ బరిలో నిలిచే మూవీగా బలగం మారనుందనే భరోసా తెలుగు టూ స్టేట్స్‌తో పాటు.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇస్తోంది. అలా మొత్తానికి ఆస్కార్‌ చేజిక్కించుకునేందుకు బలగం తన పయనాన్ని మొదలు పెట్టనుంది. స్వచ్చమైన తెలుగు మట్టి నుంచి పుట్టిన సినిమా కావడమే బలగానికి అసలైన బలం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి