Prabhas: ప్రభాస్ న్యూలుక్ అదిరిపోయింది.. మాస్ అండ్ స్టైలీష్ లుక్లో డార్లింగ్.. వైరలవుతున్న ఫోటో..
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ వచ్చే నెల అంటే జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న చిత్రాలన్ని పాన్ ఇండియా చిత్రాలు కావడంతో క్షణం తీరిక లేకుండా వరుసగా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు సాహో, రాధేశ్యామ్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అభిమానులు డార్లింగ్ సినిమాల విషయంలో నిరాశగా ఉన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ అంచనాలన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ వచ్చే నెల అంటే జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న చిత్రాలన్ని పాన్ ఇండియా చిత్రాలు కావడంతో క్షణం తీరిక లేకుండా వరుసగా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే మే 9న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ సందర్భంగా భారత దేశంలోని పలు ముఖ్య నగరాల్లో ప్రభాస్ సందడి చేయనున్నారు. ఇప్పటికే మూవీ టీమ్ అందుకు సంబంధించిన అన్నీ షెడ్యూల్ చేసింది. ఈ ట్రైలర్ లాంచ్ కు ముందు ప్రభాస్ న్యూలుక్ పిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. మొన్నటి వరకు చాలా లావుగా కనిపించిన డార్లింగ్.. ఇప్పుడు లుక్ పూర్తిగా మారిపోయింది. ఇందులో డార్లింగ్ మరింత స్టైలీష్ అండ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. తెల్ల చొక్కా, చిరిగిన డెనిమ్ జీన్స్ వైట్ స్నీకర్స్ లో హాట్ గా కనిపిస్తున్నారు. ఆయన పక్కనవారితో మాట్లాడుతుండగా.. తీసిన పిక్ ఇప్పుడు వైరలవుతుండగా.. ఈ లుక్ ఏ సినిమా కోసం అనే చర్చ మొదలైంది.
దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ ను దాదాపు 70 దేశాల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో తొలి ప్రదర్శన జరగనుంది. గతంలో విడుదలైన టీజర్ పై విమర్శలు రాగా.. వీఎఫ్ఎక్స్ లో భారీగానే మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.