Tollywood: మొదట నటనతో మెప్పించి.. ఇప్పుడు అందంతో చంపేస్తోన్న మృణాల్‌ ఈ ఫొటోలో ఉంది. కనిపెట్టారా?

మృణాల్ ఠాకూర్.. కేవలం ఒక్క సినిమాతో తెలుగునాట ఓవర్‌నైట్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. అందంతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.

Tollywood: మొదట నటనతో మెప్పించి.. ఇప్పుడు అందంతో చంపేస్తోన్న మృణాల్‌ ఈ ఫొటోలో ఉంది. కనిపెట్టారా?
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: May 08, 2023 | 3:31 PM

మృణాల్ ఠాకూర్.. కేవలం ఒక్క సినిమాతో తెలుగునాట ఓవర్‌నైట్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. అందంతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. మొదట నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ అందాల భామ.. ఇప్పుడు అందంతో ఫ్యాన్స్‌ను చంపేస్తోంది. సెలెక్ట్‌డ్‌గా కథలను ఎంచుకుంటూ.. తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకుంటూపోతోంది. మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత బుల్లితెరపై మెరిసి.. ఇప్పుడు వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది.

‘సూపర్ 30’, ‘ధమాకా’, ‘జెర్సీ’ లాంటి చిత్రాలతో హిందీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘సీతారామం’తో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్.. తొలి చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ దక్కించుకుంది. ఆ తర్వాత హిందీలో అక్షయ్ కుమార్ సరసన ఓ చిన్న పాత్ర చేసి.. తనలోని గ్లామర్ టచ్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో నాని సరసన ఓ చిత్రంలో, హిందీలో మరో మూడు చిత్రాల్లో నటిస్తోంది మృణాల్ ఠాకూర్.

Mrunal Thakur