AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ది కేరళ స్టోరీ సినిమాపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. ‘ఇది..అసలైన పాన్ ఇండియా సినిమా’..

ఎంతో మంది అమ్మాయిల జీవిత కథ ఇదీ అంటూ కొందరు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ఈ మూవీని బ్యాన్ చేయాలంటున్నారు. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma: ది కేరళ స్టోరీ సినిమాపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. 'ఇది..అసలైన పాన్ ఇండియా సినిమా'..
Ram Gopal Varma
Rajitha Chanti
|

Updated on: May 08, 2023 | 3:34 PM

Share

ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ సినిమా పేరే. ప్రస్తుతం దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ మూవీ. మే 5న విడుదలైన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్నో వివాదాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబడుతుంది. ఎంతో మంది అమ్మాయిల జీవిత కథ ఇదీ అంటూ కొందరు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ఈ మూవీని బ్యాన్ చేయాలంటున్నారు. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

“తమిళ్/ మలయాళీ అమ్మాయి హీరోయిన్. గుజరాతీ నిర్మాత.. బెంగాలీ డైరెక్టర్.. ఈ హిందీ సినిమా అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. ఇదీ అసలైన పాన్ ఇండియా చిత్రమంటే ” అంటూ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ ట్వీట్ పై విభిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్స్. 2018-19లో దాదాపు 32 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారు. వారు ఎక్కడున్నారు ?ఏమైపోయారు ?అని పట్టించుకునేవాళ్లు లేరు. ఆ కథనే ది కేరళ స్టోరీగా వెండితెరపైకి తీసుకువచ్చారు డైరెక్టర్ సుదీప్తోసేన్. ఇందులో ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించగా.. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు.

ఇవి కూడా చదవండి

అనేక వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా..భారీగా వసూళ్లు రాబడుతుంది. ఫస్ట్ డే రూ. 8.02 కోట్లు.. సెకండ్ డే రూ. 11.22 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఆదివారం ఏకంగా రూ. 16 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు దాదాపు రూ.32 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఆదా శర్మ హిందూ అమ్మాయిగా కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు
దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?
దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా?
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా?