AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: అమ్మాయిలలో నచ్చేది అదే.. ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్ పై నాగచైతన్య ఓపెన్ కామెంట్స్..

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా.. చైతూతో కృతి శెట్టి మరోసారి జోడి కట్టింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా మే 12న తెలుగుతోపాటు.. తమిళంలోనూ విడుదల కానుంది.

Naga Chaitanya: అమ్మాయిలలో నచ్చేది అదే.. ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్ పై నాగచైతన్య  ఓపెన్ కామెంట్స్..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: May 08, 2023 | 2:41 PM

Share

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం నటిస్తోన్న సినిమా కస్టడీ. ఇప్పటివరకు లవర్ బాయ్‏గా ప్రేక్షకులను అలరించిన ఈ హీరో.. ఇప్పుడు సీరియస్ రోల్‏తో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా.. చైతూతో కృతి శెట్టి మరోసారి జోడి కట్టింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా మే 12న తెలుగుతోపాటు.. తమిళంలోనూ విడుదల కానుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. తన ఫస్ట్ కిస్… ఫస్ట్ డేట్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశాడు.

తాను ఆరు లేదా ఏడో తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని.. ఇంటర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ డేట్ కోసం కాఫీ షాపుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే ఆన్ స్క్రీన్ ఫస్ట్ కిస్ ఏ మాయ చేసావే సినిమాలో జరిగిందని.. ఆఫ్ స్క్రీన్ ఫస్ట్ కిస్ ఎప్పుడ జరిగిందనేది చెప్పాలనుకోవడం లేదని.. అమ్మాయిలో తాను ఫస్ట్ గమనించేది.. నచ్చేది… కేవలం తన వ్యక్తిత్వం మాత్రమే అని అన్నారు. “నాకు ఒంటరితనం అంటే ఇష్టం. ఎక్కువగా ఒంటరిగా ఉంటుంటాను.. ఒంటరిగా ఉన్నప్పుడే మన గురించి మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. కొత్త ఆలోచనలు పుడతాయి. జీవితం మరింత బ్యాలెన్స్ గా ఉండేందుకు అవి తోడ్పడుతాయి ” అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చైతూ..ఆ తర్వాతా ఏమాయ చేసావే మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటించింది. ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ మూవీ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది. ఆ తర్వాత 2017లో ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి కాగా.. నాలుగేళ్లలోనే వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఇద్దరూ బిజీగా ఉన్నారు.

Follow Us
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి