AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పక్కా కమర్షియల్’ కోసం పక్కాప్లాన్ సిద్ధం చేస్తున్న మారుతి.. అక్టోబర్ టార్గెట్‌‌‌‌‌గా షూటింగ్..

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న ఈ టాలెంటెడ్ హీరో.

'పక్కా కమర్షియల్' కోసం పక్కాప్లాన్ సిద్ధం చేస్తున్న మారుతి.. అక్టోబర్ టార్గెట్‌‌‌‌‌గా షూటింగ్..
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2021 | 11:23 AM

Share

Gopichand : మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న ఈ టాలెంటెడ్ హీరో. సీటిమార్ సినిమాతో సాలిడ్ సక్సెస్ కొట్టాలని కసిమీద ఉన్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గోపీచంద్ తమన్నా ఇద్దరు ఈ మూవీలో కబడ్డీ కోచ్ లుగా కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు గోపీచంద్.

ఈ సినిమాను పక్కా కమర్షియల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కామెడీ ప్రధానంగా కథను రాసుకునే మారుతి గోపీచంద్ కోసం ఓ అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక చివరగా సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ప్రతిరోజు పండుగ అనే సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు మారుతి. ఇక పక్క కమర్షియల్ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమా  2021 అక్టోబర్ 1 న సినిమాస్(థియేటర్ల)లో కి ..! అంటూ టీమ్ అనౌన్స్ చేసింది. అదేవిధంగా అక్టోబర్ ను  టార్గెట్ చేసి షూటింగ్ చకచకా పూర్తి  చేయాలనీ భావిస్తున్నారు. యువి క్రియేషన్స్ – జీఏ2 సంస్థలు సంయక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీలో అందాల భామ రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.   మారుతి ప్రతిరోజు పండుగే సినిమాలోనూ రాశిఖన్నా హీరోయిన్. అమ్మడి నటన నచ్చడంతో ఈ సినిమాలో కూడా రాశినే ఫిక్స్ చేసారని తెలుస్తుంది. ఇక పక్కా కమర్షియల్ అన్న టైటిల్ కి తగ్గట్టే ప్రతిదీ కమర్షియల్ గా ఆలోచించే యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya movie : ఖమ్మంలో ఆచార్య మూవీ షూటింగ్.. బొగ్గుగనుల వద్ద భారీగా అభిమానులు.. పోలీసుల బందోబస్త్

Anasuya Bharadwaj : అందాల అనసూయ ‘ఖిలాడి’గా కనిపించనుందా.. నెగిటివ్ రోల్‌‌‌‌‌లో రంగమ్మత్త..?

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?