AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ సినిమా కోసం పాకిస్థాన్ హీరోయిన్‌ను దింపుతున్నారా.?

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్. రీసెంట్ గా కల్కి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించారు. జూన్ 27న విడుదలైన కల్కి ఇప్పటికి కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. 

Prabhas: ప్రభాస్ సినిమా కోసం పాకిస్థాన్ హీరోయిన్‌ను దింపుతున్నారా.?
Prabhas
Rajeev Rayala
|

Updated on: Jul 22, 2024 | 2:40 PM

Share

పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్  రీసెంట్ గా కల్కి సినిమాతో వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్. రీసెంట్ గా కల్కి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించారు. జూన్ 27న విడుదలైన కల్కి ఇప్పటికి కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.  ‘కల్కి 2898 AD’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రభాస్ రాబోయే సినిమాలపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రభాస్ కొత్త సినిమాలో పాకిస్థానీ హీరోయిన్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగచైతన్యకు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్ ఈమె..

ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ చేతులు కలపనున్నాడు. ఈ సినిమాలో నటీనటుల గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం ఓ పాకిస్థానీ నటిని ఎంపిక చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి :అంతఃపురంలో సౌందర్య కొడుకుగా చేసిన ఈ చిన్నోడు.. ఇప్పుడు హీరో లుక్‌లోకి మారిపోయాడు

సజల్ అలీ పాకిస్థాన్‌లో ఫేమస్. సోషల్ మీడియాలో కోటి మందికి పైగా ఫాలో అవుతున్నారు. సజల్ అలీకి చాలా సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటించిన అనుభవం ఉంది. గతంలో బాలీవుడ్‌లో ‘మామ్‌’ సినిమాలో నటించింది. తన అందంతో అభిమానుల మనసు దోచుకుంది. ప్రభాస్ కొత్త సినిమాలో సజల్ అలీనే హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కాగా  ఓ పాకిస్థానీ నటిని తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రశ్నకు చిత్రబృందం సమాధానం చెబుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల పాకిస్థానీ ఆర్టిస్టులకు భారతీయ సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. బాలీవుడ్ లో కొంతమంది పాక్ నటీనటులు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే