AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV : రాంగోపాల్ వర్మకు మరోసారి పోలీసులు నోటీసులు..

సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నమోదైన కేసులో ఈనెల 19న విచారణకు హాజరుకావాలని వర్మకు మద్దిపాడు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు... మరోవైపు ఈ కేసు కొట్టి వేయాలంటూ హైకోర్టులో వర్మ వేసిన స్వ్యాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది...

RGV : రాంగోపాల్ వర్మకు మరోసారి పోలీసులు నోటీసులు..
Rgv
Fairoz Baig
| Edited By: Rajeev Rayala|

Updated on: Nov 25, 2024 | 11:09 AM

Share

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్ లో పోస్టులు పెట్టారన్న కారణంగా ఈనెల 10వ తేదీన మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నమోదైన కేసులో ఈనెల 19న విచారణకు హాజరుకావాలని వర్మకు మద్దిపాడు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు… మరోవైపు ఈ కేసు కొట్టి వేయాలంటూ హైకోర్టులో వర్మ వేసిన స్వ్యాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది… అవసరమైతే ముందస్తు బెయిల్‌ కోసం అప్పీలు చేసుకోవాలని సూచించింది… విచారణకు పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరై సమయం అవసరమైతే విచారణ అధికారిని కోరవచ్చని హైకోర్టు పేర్కొంది… దీంతో ఈనెల 19న విచారణ కోసం ఒంగోలుకు రావాల్సిన వర్మ తనకు సమయం కావాలని కోరారు…

పెళ్లైన హీరోతో ఆ యవ్వారం .. దెబ్బకు కెరీర్ క్లోజ్, ఇప్పుడేమో ఇలా

వర్మను విచారించేందుకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసి రెడీగా ఉన్న పోలీసులకు 19వతేది ఉదయం 8 గంటల ప్రాంతంలో వర్మ నేరుగా విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్‌ సిఐ శ్రీకాంత్‌బాబుకు వాట్సప్‌ మెసేజ్‌ చేశారు… తనకు ముందుగానే ఏర్పాటుచేసుకున్న షూటింగ్‌ల కారణంగా 19వ తేదీ విచారణకు హాజరుకాలేకపోతున్నానని, వారం రోజుల గడువు కావాలని కోరారు… అలాగే ఒంగోలుకు చెందిన తన లాయర్‌ ఎన్‌. శ్రీనివాసరావును వ్యక్తిగతంగా సిఐను కలిసేందుకు పంపించారు… విచారణకు హజరయ్యేందుకు వారం రోజుల గడువు కోరుతూ వర్మ పంపించిన రిక్వెస్ట్‌ లెటర్‌ను ఆయన తరపు లాయర్‌ సిఐ శ్రీకాంత్‌కు అందించారు… దీంతో వర్మకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు… నేడు అంటే ఈనెల 25వ తేదీన విచారణ అధికారి ముందు హాజరు కావాలని వర్మకు నోటీసులు పంపించారు…

Ram Charan: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. రామ్ చరణ్ సరసన క్రేజీ హీరోయిన్..

తొలుత హైదరాబాద్‌కు వెళ్ళి నోటీసులు ఇచ్చిన పోలీసులు, రెండోసారి వర్మ కు వాట్సప్ ద్వారా నోటీసులు ఇచ్చి నేడు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నారు… వర్మను ప్రశ్నించేందుకు ప్రశ్నలను సిద్దం చేసుకున్నారు…

పంజరంలో చిలక.. నేను మీకు అస్సలు దొరక.. ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్‌ను కనిపెట్టండి చూద్దాం.!

ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎక్స్‌లో టిడిపి అధినేత చంద్రంబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్మపై ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై ఈనెల 10న ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..