Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Ashwini: టాలీవుడ్‏లో చాలా ఫేమస్.. వందకు పైగా సినిమాలు.. చివరకు అనాథలా మరణించిన అశ్విని..

ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతుంటారు. సినిమాలు చేయకపోయినా అడియన్స్ హృదయాల్లో చిరకాలం నిలిచిపోయిన తారలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో మెప్పించిన కొందరు తారల వ్యక్తిగత జీవితాలు విషాదంగా ముగుస్తాయి. అందులో ఈ నటి కూడా ఒకరు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ నటి పేరు అశ్విని.

Actress Ashwini: టాలీవుడ్‏లో చాలా ఫేమస్.. వందకు పైగా సినిమాలు.. చివరకు అనాథలా మరణించిన అశ్విని..
Ashwini
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 26, 2024 | 12:20 PM

సినీరంగుల ప్రపంచంలో ఎంతో మంది నటనపై ఆసక్తితో అడుగుపెడుతుంటారు. నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. అవమానాలు, సవాళ్లు, కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటారు. కానీ వెండితెరపై కొంతమంది మాత్రమే ఫేమస్ అవుతుంటారు. మరికొందరు ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుంటారు. అయితే సెలబ్రెటీలుగా వచ్చిన గుర్తింపును కాపాడుకోవాలి అనుకున్నా.. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్‏లో మంచి క్రేజ్ సంపాదించుకున్న స్టార్స్.. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతుంటారు. సినిమాలు చేయకపోయినా అడియన్స్ హృదయాల్లో చిరకాలం నిలిచిపోయిన తారలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో మెప్పించిన కొందరు తారల వ్యక్తిగత జీవితాలు విషాదంగా ముగుస్తాయి. అందులో ఈ నటి కూడా ఒకరు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ నటి పేరు అశ్విని.

తెలుగు సినీరంగంలో స్టార్ హీరోల సరసన నటించిన అశ్విని.. 90ల్లోనే తెలుగులో నటించడం మానేసింది. ఆ తర్వాత తమిళ సినిమాలకే పరిమితం అయిపోయింది. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ అచ్చ తెలుగమ్మాయి చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత కథానాయికగా మారింది. సుమారు వందకు పైగా సినిమాల్లో నటించింది. కానీ చివరకు అనాథలా మరణించింది. అశ్విని చనిపోయాక ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు మరో స్టార్ నటుడు సాయం చేయాల్సి వచ్చింది. 1967 జూలై 14న పుట్టిన అశ్విని.. సీనియర్ నటి భానుమతి తీసిన భక్త ధృవ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.

ఆ తర్వాత చదువులపై శ్రద్ధ పెట్టి కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఓ తమిళ సినిమా ఆఫర్ రావడంతో కథానాయికగా అడియన్స్ ముందుకు వచ్చింది. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంది. అనాదిగా ఆడది, భలే తమ్ముడు, అరణ్య కాండ, కలియుగ పాండవులు, చూపులు కలిసిన శుభవేళ, పెళ్లి చేసి చూడు, కొడుకు దిద్దిన కాపురం ఇలా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో మొత్తం 100కు పైగా చిత్రాల్లో నటించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే రచయిత పువియరుసు మనవడిని రహస్యం వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే వైవాహిక జీవితం సరిగ్గా సాగలేదని.. దీంతో మానసిక ఒత్తిడికి గురైంది. ఓ బిడ్డను దత్తత తీసుకున్న అశ్విని.. 2012లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ అనారోగ్య సమస్యలతో 2012 సెప్టెంబర్ 23న మరణించింది. 45 వయసుల్లోనే అనాథల మరణించిన అశ్వినిని స్వస్థలానికి తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో తమిళ్ హీరో పార్తీబన్ సాయం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.